కొత్తూరు వైసీపీలో విభేదాలు

ABN , First Publish Date - 2021-10-28T05:57:17+05:30 IST

కొత్తూరు వైసీపీలో విభేదాలు

కొత్తూరు వైసీపీలో విభేదాలు
అధికారులను నిలదీస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు

- మండల సమావేశం నుంచి ఒక వర్గం సభ్యుల వాకౌట్‌

కొత్తూరు : మండల వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశమే ఇందుకు నిదర్శనం. ఎంపీడీవో ప్రొటోకాల్‌ పాటించలేదంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ సమావేశాన్ని వాకౌట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే... పార్టీ విప్‌ను ధిక్కరించి వైస్‌ఎంపీపీగా ఎన్నికైన వైసీపీ రెబల్‌ అభ్యర్థి లోతుగెడ్డ తులసీవర ప్రసాద్‌ సభా వేదికపై కూర్చోడాన్ని స భలోని పలువురు సభ్యులు తప్పుబట్టారు. దీనిపై ఎంపీడీవోను బలద ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ మండల కన్వీనర్‌ సారిపి ల్లి ప్రసాదరావు, కొత్తూ రు-2 ఎంపీటీసీ సభ్యురాలు గండివలస రత్నకుమారి, హిరమండలం ఏఎంసీ  చైర్మన్‌ గోగుల మాధవి ప్రశ్నించగా... సరైన సమాధానం రాక పోవడంతో అసహనం వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్‌ చేశారు. వీరితోపాటు సర్పంచ్‌ యర్లంకి ధర్మారావు, కలిగాం, ఓండ్రు జోల, కౌసల్యపురం సర్పంచ్‌లు ఉన్నారు. దీంతో ఎంపీపీ, వైఎస్‌ ఎంపీపీ ఎన్నిక సమయంలో నెలకొన్న విభేదాలు ఇంకా కొనసాగు తుండడం విశేషం. 

Updated Date - 2021-10-28T05:57:17+05:30 IST