ఆధార్ లింక్ కోసం అవస్థలు
ABN , First Publish Date - 2021-05-25T05:22:26+05:30 IST
ఆధార్ లింక్ కోసం అవస్థలు

ఆమదాలవలస: మహిళలకు జగనన్న ఆసరా పథకం కింద అందజేసే ఆర్థిక సాయం కోసం ఆధార్‌కార్డు బ్యాంక్‌ఖాతా, ఫోన్‌నెంబర్‌తో లింక్ తప్పనిసరి చేశారు. ఏటా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సుగల మహిళల ఖాతాల్లో రూ.18వేలు జమ చేస్తున్న విషయం విదితమే. ఈ పథకం కింద అర్హులతోపాటు గతఏడాది వివిద కారణాలవల్ల పథకం కింద లబ్ధిపొందలేని వారంతా ఆధార్‌కార్డు బ్యాంక్‌ఖాతాకు ఫోన్ నెంబర్ లింకుచేయాలని వలంటీర్లు తెలియజే యడంతో 45ఏళ్లు నిండిన మహిళలు మీసేవ కేంద్రాలు వద్దకు బారులుతీరుతున్నారు. సోమవారం ఆమదాలవలస మెయిన్ రోడ్డులో గల ఆధార్ నమోదు కేంద్రం వద్ద మహిళలు అవస్థలుపడ్డారు.