బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2021-02-06T05:26:27+05:30 IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు శుక్రవారం ఆందోళన చేశారు. భోజనం విరామ సమయంలో స్థానిక సంచార భవనం వద్ద ఆందోళన చేపట్టారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ఆందోళన
ఆందోళన చేస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు

గుజరాతీపేట : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు శుక్రవారం ఆందోళన చేశారు. భోజనం విరామ సమయంలో స్థానిక సంచార భవనం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు పి.వెంకటరావు, ఎం.గోవిందరావులు మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలో 80వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని తెలిపారు. వీరివల్ల సంస్థకు రూ.500 కోట్లు మిగులుతున్నా ప్రస్తుత ఉద్యోగులకు   సక్రమంగా జీతాలు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు లక్ష్మి, అరుణశ్రీ, శివప్రసాద్‌, వి.శ్రీనివాసరావు, ఎస్‌.అభిమన్యు, హెచ్‌.మల్లేసు, అనీల్‌, జి.పెంటయ్య, జి.లోకనాథం, హెచ్‌.సూర్యనారాయణ, కిరణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T05:26:27+05:30 IST