నిబంధనల మేరకు నష్టపరిహారం

ABN , First Publish Date - 2021-12-08T05:36:41+05:30 IST

వంశధార నది కరకట్టల నిర్మాణానికి సంబంధించి భూములను ఇచ్చిన రైతులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత తెలిపారు. స్కాట్‌పేట గ్రామ సమీపంలో వంశధార నది కరకట్టల భూములను మంగళవారం పరిశీలించారు.

నిబంధనల మేరకు నష్టపరిహారం
కరకట్టల భూములను పరిశీలిస్తున్న జేసీ విజయసునీత


 జేసీ విజయ సునీత 

స్కాట్‌పేట(ఎల్‌.ఎన్‌.పేట), డిసెంబరు 7: వంశధార నది కరకట్టల నిర్మాణానికి సంబంధించి భూములను ఇచ్చిన రైతులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత తెలిపారు. స్కాట్‌పేట గ్రామ సమీపంలో వంశధార నది కరకట్టల భూములను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో వంశధార నది కరకట్టల నిర్మాణానికి భూములను సేకరించినప్పటికీ మరికొంత భూమి ఇపుడు అవసరమైనందున రైతుల నుంచి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా భూములకు తగిన ధరను నిర్ణయించి నష్టపరిహారం అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ,  సర్వేయర్‌ గవరయ్య పాల్గొన్నారు.

  

Updated Date - 2021-12-08T05:36:41+05:30 IST