రుణాంధ్రప్రదేశ్‌గా మార్చిన సీఎం

ABN , First Publish Date - 2021-07-25T04:47:08+05:30 IST

రుణాంధ్రప్రదేశ్‌గా మార్చిన సీఎం

రుణాంధ్రప్రదేశ్‌గా మార్చిన సీఎం
కొత్తూరులో ఇసుకతో రోడ్డు చదును చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, టీడీపీ శ్రేణులు

- ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

- కొత్తూరులో రహదారిపై గోతులు పూడ్చిన టీడీపీ నేతలు

కొత్తూరు, జూలై 24: రాష్ట్రాన్ని రుణాంధ్రపదేశ్‌గా మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్‌ బెందాళం అశోక్‌ అన్నారు. రహదారుల దుస్థితిపై కొత్తూరులో టీడీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్దఎత్తున హాజరయ్యారు. అలికాం-బత్తిలి మార్గంలో పాడైన రహదారిపై మట్టిని వేసి పూడ్చారు. క్రషర్‌ పొడి వేసి చదును చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త రోడ్లు మంజూరు చేయకపోగా..ఉన్న రహదారుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సీఎం జగన్‌ పన్నులతో ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు. కరోనా విపత్తుతో ప్రజలు విలవిల్లాడుతుంటే సీఎం కార్యాలయాన్ని కూడా దాటలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు సహజ వనరులను దోచుకునే ప్రయత్నంలో ఉన్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు  మెండ దాసునాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్మి కటమట సాగర్‌, జిల్లా ప్రదాన కార్యదర్మి పీరుకట్ల విఠల్‌రావు, తెలుగు రైతు అధ్యక్షుడు ఒమ్మి అనందరావు, చింతాడ కొటి, పెద్దిన కలశేఖరంతో పాటు పాతపట్నం నియోజకవర్గంలోని ఐదు మండలాల శ్రేణులు పాల్గొన్నాయి. 

 

Updated Date - 2021-07-25T04:47:08+05:30 IST