రేపు సీఎం రాక

ABN , First Publish Date - 2021-12-26T05:20:37+05:30 IST

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం పరిశీలించారు.

రేపు సీఎం రాక
ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి సురేష్‌

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సురేష్‌

ఎర్రగొండపాలెం, డిసెంబరు 25:  ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం పరిశీలించారు. మంత్రి సురేష్‌ కుమార్తె వివా హం ఈనెల 17న హైదరాబాద్‌లో జరిగింది. 27న వైపాలెంలో వివాహ రిసె ప్షన్‌ను  వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ వద్ద ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సీఎం  హాజరవుతున్నారు. జగన్‌ రాక సందర్భంగా హెలిప్యాడ్‌, రిసెప్షన్‌ వేదిక, వీఐపీల భోజనాల వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లను మంత్రి సురేష్‌ పోలీసు అధికారులతో కలసి స్వయంగా పరిశీలించారు.  ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.  కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ కె.కిశోర్‌కుమార్‌, ఇంటెల్‌జెన్సు అధికారులు, ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, సీఐ పి.దేవప్రభాకర్‌, త్రిపురారంతకం ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, ఎర్రగొండపాలెం ఎంపీపీ డి.కిరణ్‌గౌడ్‌, తహసీల్దార్‌ వీరయ్య, ఎంపీడీవో సాయికుమార్‌, ఎస్‌ఐ సురేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T05:20:37+05:30 IST