డిపాజిట్లు చెల్లించండి

ABN , First Publish Date - 2021-12-16T04:41:15+05:30 IST

రాజాంలోని సహారా ఇండియా కార్యాలయం వద్ద డిపాజిట్‌దారులు బుధవారం ఆందోళన కు దిగారు. తాము డిపాజిట్‌ చేసిన బాండ్లకు మెచ్యూరిటీ గడువు దాటినా.. డబ్బులు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు చెల్లించాలంటూ మేనేజర్‌తో పాటు సిబ్బందిని డిపాజిట్‌దారులు వివేక్‌నంద, సాయి, బాబూరావు, శ్రీనివాసరావు, జగన్నాథం తదితరులు నిలదీశారు.

డిపాజిట్లు చెల్లించండి
ఆందోళన చేస్తున్న డిపాజిట్‌దారులు

- సహారా ఇండియా కార్యాలయం వద్ద ఖాతాదారుల ఆందోళన

- బ్రాంచ్‌ మేనేజర్‌ నిర్బంధం

రాజాం, డిసెంబరు 15 : రాజాంలోని సహారా ఇండియా కార్యాలయం వద్ద డిపాజిట్‌దారులు బుధవారం ఆందోళన  కు దిగారు. తాము డిపాజిట్‌ చేసిన బాండ్లకు మెచ్యూరిటీ గడువు దాటినా.. డబ్బులు చెల్లించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు చెల్లించాలంటూ మేనేజర్‌తో పాటు సిబ్బందిని డిపాజిట్‌దారులు వివేక్‌నంద, సాయి, బాబూరావు, శ్రీనివాసరావు, జగన్నాథం తదితరులు నిలదీశారు. రాజాం బ్రాంచ్‌ పరిధిలో సుమారు వెయ్యిమందికి పైగా ఖాతాదారులు దాదాపు రూ.10 కోట్ల వరకు డిపాజిట్‌ చేశారు. వీరిలో వంద మందికిపైగా ఖాతాదారుల డిపాజిట్‌ల మెచ్యూరిటీ గడువు పూర్తయి రెండేళ్లవుతోంది. సుమారు రూ.4 కోట్లు వరకు ఖాతాదారులకు చెల్లించాల్సి ఉంది. కానీ తమను కార్యాలయం చుట్టూ తిప్పుతూ.. డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని డిపాజిట్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బ్రాంచ్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ను నిలదీసినా స్పందించకపోవడంతో ఆయనను నిర్బంధించారు. దీంతో అందరికీ నగదు చెల్లిస్తామని, కొద్దిరోజుల గడువు కావాలని బ్యాంక్‌ మేనేజర్‌ కోరారు. ఈ నేపథ్యంలో డిపాజిట్‌దారులు శాంతించారు. డబ్బులు చెల్లించకపోతే.. పోలీసులను ఆశ్రయిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-12-16T04:41:15+05:30 IST