పిల్లలకు కష్టపడేతత్వాన్ని అలవర్చాలి

ABN , First Publish Date - 2021-03-15T05:15:13+05:30 IST

పిల్లలకు కష్టపడేతత్వంతో పాటు బాధ్యతగా నడుచుకోవడాన్ని అలవర్చాల్సిన అవసరం తల్లి దండ్రులపై ఉందని పర్లాకిమిడి సెంచురియన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనితపత్ర పేర్కొన్నారు.

పిల్లలకు కష్టపడేతత్వాన్ని అలవర్చాలి
మాట్లాడుతున్న రిజిస్ట్రార్‌ అనితపత్ర

 సెంచురియన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌  డాక్టర్‌ అనితపత్ర

గుజరాతీపేట,మార్చి 14: పిల్లలకు కష్టపడేతత్వంతో పాటు బాధ్యతగా నడుచుకోవడాన్ని అలవర్చాల్సిన అవసరం తల్లి దండ్రులపై ఉందని పర్లాకిమిడి సెంచురియన్‌ యూనివర్సిటీ  రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనితపత్ర పేర్కొన్నారు. ఆదివారం  నగ రంలోని ఓ హోటల్‌లో తల్లిదండ్రులతో నిర్వహించిన సమా వేశంలో ఆమె మాట్లాడారు.  ‘చాలామంది తల్లిదండ్రులు తా ము జీవితంలో అనేక విధాలుగా కష్టపడ్డాం... తమవలే తమ పిల్లలు కూడా కష్టపడకూడదన్న తాపత్రయంతో వారిని అతి గారాభం చేస్తారు. దీనివల్ల వారు జీవితంలో రాణించలేకపో తున్నారు. పర్లాకిమిడిలో సెంచూరియన్‌ యూనివర్సిటీ  మెయిన్‌ క్యాంపస్‌ ఉంది.  భువనేశ్వర్‌, విజయనగరం, రాయ ఘడ, బలంగోడు, చత్రఫూర్‌, బాలాసూర్‌లలో అనుబంధ క్యాంపస్‌లు ఉన్నాయి.  కేజీ టు పీజీ వరకు  నాణ్యతమైన బోధన అందిస్తున్నాం. పీహెడీలు, పారామెడికల్‌, అగ్రికల్చరల్‌ తదితర అనేక విభాగాలకు చెందిన కోర్సులు మా యూని వర్సిటీ పరిధిలో ఉన్నాయి. విద్యార్థులకు చక్కని కమ్యూని కేషన్‌ స్కిల్స్‌, పర్సనాల్టీ డెవలప్‌మెంట్‌, పోటీ పరీక్షలకు తీర్చిదిద్దడం,  క్రమశిక్షణ, సోర్ట్స్‌, కల్చరల్‌, ఇతరత్రా అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నాం.’ అని  అనితపత్ర తెలిపారు. విజయన గరం క్యాంపస్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీవీ గోపీనాథ్‌ మాట్లాడుతూ, సెంచూరియన్‌ యూనివర్సిటీకి సిల్డ్‌ యూనివర్సిటీ అనే మారుపేరు కూడా ఉందన్నారు. తమ యూనివర్సిటీకి ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌పర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌), నెక్‌, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడేషన్‌(ఎన్‌బీఏ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)ల గుర్తింపు ఉందని తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చరల్‌ డీన్‌ డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ, డేస్కాలర్స్‌ కన్నా క్యాంపస్‌లో ఉంటూ చదువుకునే విద్యార్థులు అన్ని విధాలా రాణిస్తున్నట్లు చెప్పారు.  ఈ సమావేశంలో ప్రొఫెసర్‌  వీఎన్‌ రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ సందీపన్‌ పిన్‌, ప్లేస్‌మెంట్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ డా కామేశ్వరరావు, అడ్మినిస్ట్రేషన్‌ మేనేజర్‌ ఎస్‌.ఫల్గుణరావులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-15T05:15:13+05:30 IST