రక్షిత పథకం బాగు చేయండి

ABN , First Publish Date - 2021-08-28T04:51:43+05:30 IST

రక్షిత పథకం బాగు చేయండి

రక్షిత పథకం బాగు చేయండి
చిలకపాలెంలో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేస్తున్న మహిళలు

ఖాళీ బిందెలతో చిలకపాలెం మహిళల నిరసన 

ఎచ్చెర్ల, ఆగస్టు 27: ‘తాగునీటి కోసం అల్లాడుతున్నాం.. 15 రోజులుగా రక్షిత పథకం నుంచి చుక్క నీరు కూడా రావడం లేదు.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు’ అంటూ చిలకపాలెం గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఖాళీ బిందెలతో గ్రామంలోని రక్షితనీటి పథకం వద్ద నిరసన తెలిపారు. తాగునీటికి, ఇతర అవసరాలకు నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్‌ స్పందించి రక్షిత పథకాన్ని బాగు చేయించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే గ్రామ సచివాలయం, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్‌.అమ్మన్నాయుడు, సీపీఎం నాయకుడు తోనంగి నందోడు, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-28T04:51:43+05:30 IST