వైభవంగా చక్రధరుని డోలోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-20T05:26:50+05:30 IST

బెజ్జిపుట్టుగలో చక్రధర పెరుమాళ్ల డోలోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం బార్లవీధికి చెందినవారితో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

వైభవంగా చక్రధరుని డోలోత్సవాలు

కవిటి: బెజ్జిపుట్టుగలో చక్రధర పెరుమాళ్ల డోలోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.  ఈ మేరకు శుక్రవారం బార్లవీధికి చెందినవారితో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన హరికఽథ గానంతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలో స్వామివారి తిరువీధి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పి.కృష్ణారావు, పి.రాంబాబు, బి.జగన్నాధం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-20T05:26:50+05:30 IST