కాంట్రాక్ట్‌ ఉద్యోగికి దేహశుద్ధి

ABN , First Publish Date - 2021-11-10T04:51:38+05:30 IST

కళాశాలలకు వెళ్తున్న విద్యార్థినులతో అస భ్యకరంగా ప్రవరిస్తున్న ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగికి దేహశుద్ధి
శ్రీనివాసరావును స్తంభానికి కట్టేసిన దృశ్యం

  విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

  స్తంభానికి కట్టేసి కొట్టిన గేదెలపేట గ్రామస్థులు

రాజాం (జి.సిగడాం) నవంబరు 9: కళాశాలలకు వెళ్తున్న విద్యార్థినులతో అస భ్యకరంగా ప్రవరిస్తున్న ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ ఘటన జి.సిగడాం మండలం గేదెలపేట గ్రామంలో జరిగింది. వివరా ల్లోకి వెళ్తే.. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పి.శ్రీనివాసరావు రా జాం మునిసిపాలిటీలోని తాగునీటి సరఫరా విభాగంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తోన్నాడు. శ్రీనివాస్‌ ప్రతిరోజూ గేదెలపేట కూడలిలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద కళాశాలలకు వెళ్లే విద్యార్థినులను అటకాయించి వారితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేశా రు. దీంతో గ్రామస్థులు మంగళవారం శ్రీనివాస్‌ను మడ్డువలస ఇనుప గేటు వద్ద పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చారు. ఓ స్తంభానికి శ్రీనివాస్‌ను తాళ్లతో కట్టేసి దేహశుద్ధి చేశారు.  అనంతరం  పోలీసులకు అప్పగించారు. వంగర ఇన్‌చార్జి ఎస్‌ఐ దేవానంద్‌.. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. 

నాలుగు రోజులుగా విధులకు గైర్హాజరు

శ్రీనివాసరావు నాలుగు రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్టు రాజాం మునిసి పల్‌ కమిషనర్‌ ఎంవీ నాగరాజు తెలిపారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. విధుల నుంచి తొలగిం చేలా చర్యలు చేపడతామన్నారు. శ్రీనివాస్‌ను చట్టపరంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.Updated Date - 2021-11-10T04:51:38+05:30 IST