354 మందిపై బైండోవర్‌ కేసులు

ABN , First Publish Date - 2021-01-12T06:10:12+05:30 IST

సంక్రాంతి పండగ నేపథ్యంలో జిల్లా లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 354 మందిపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.

354 మందిపై బైండోవర్‌ కేసులు

జూదగాళ్లు, పందెంరాయుళ్లపై ప్రత్యేక నిఘా 

శ్రీకాకుళం, ఆంరఽధజ్యోతి : సంక్రాంతి పండగ నేపథ్యంలో జిల్లా లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  354 మందిపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఈమేరకు సోమవారం రాత్రి ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తంగా 37 కేసులు నమోదుచేసినట్లు వెల్లడించారు. తరచూ జూదమాడే 166 మంది, 39 మంది కోడి పందాలరాయుళ్లను బైండోవర్‌ చేసినట్టు చెప్పారు. నిరంతరం ప్రత్యేక బలగాలతో నిఘా ఉంటుందన్న విషయం ప్రజలు మర్చిపోవద్దన్నారు.

నగరంలో కార్డెన్‌సెర్చ్‌..

నగరంలోని దమ్మలవీధితోపాటు పలు వీధుల్లో స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, ఎక్సైజ్‌ బృందం కార్డెన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఇళ్లలో తనిఖీలు జరిపారు. ఎవరైనా అక్రమ మద్యం నిల్వ చేశారా.. ఇతర అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడుతున్నారా అన్నది గుర్తించారు. ఇందులో ఆరుగురు వ్యక్తులపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. 

సూదికొండ కాలనీలో...

పలాస : పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం  పరిధిలో గల సూదికొండ కాలనీలో  కాశీబుగ్గ డీఎస్పీ  డి.శివరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సోమవారం కార్డిన్‌సెర్చ్‌ నిర్వహించారు. అనుమతిలేని 45 ద్విచక్రవాహనాలు, 30లీటర్ల  సారా ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సూదికొండ ప్రాంతంలో దొంగతనాలు,  సారా విక్రయాలు జోరందుకోవడంతో ప్రత్యేక పోలీసుల సాయంతో ఇంటింటా సోదాలు చేశారు. నెంబరు ప్లేట్లు, లైసెన్స్‌ లేని వాహనాలను సీజ్‌చేశారు. సారాతో సంబంధం ఉన్న వ్యక్తులను అరెస్టు చేశారు. కార్య క్రమంలో సీఐ శంకరరావు, ఎస్‌ఐ మధుసూ దనరావు, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-12T06:10:12+05:30 IST