కోడి పందాలకు రెడీ

ABN , First Publish Date - 2021-01-12T06:07:05+05:30 IST

‘పండుగ పూట కోడి, పొట్టేళ్ల పందాలు, పేకాటలు, గుండాటలు ఆడితే కేసులు నమోదుచేస్తాం. ఎక్కడైనా నిర్వహిస్తే సమాచారం ఇవ్వండి’..అంటూ ఓ పక్క పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కరపత్రాలు అతికిస్తున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోని కొందరు పందాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రణస్థలం మండలం మరువాడ సమీపంలో ఓ పార్టీ నాయకుడి అండతో కోడి పందాల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అచ్చం

కోడి పందాలకు రెడీ
గత ఏడాది మరువాడ సమీపంలో కోడి పందాల శిబిరాలు





మరువాడలో ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు

(రణస్థలం)

‘పండుగ పూట కోడి, పొట్టేళ్ల పందాలు, పేకాటలు, గుండాటలు ఆడితే కేసులు నమోదుచేస్తాం. ఎక్కడైనా నిర్వహిస్తే సమాచారం ఇవ్వండి’..అంటూ ఓ పక్క పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కరపత్రాలు అతికిస్తున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోని కొందరు పందాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రణస్థలం మండలం మరువాడ సమీపంలో ఓ పార్టీ నాయకుడి అండతో కోడి పందాల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అచ్చం క్రికెట్‌ స్టేడియం మాదిరిగా ఫ్లడ్‌లైట్ల వెలుగులతో ఏర్పాట్లు చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గత ఏడాది మూడు రోజుల పాటు ఇక్కడ పందాల శిబిరాలు వెలిశాయి. మన జిల్లాతో పాటు విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పందాంరాయుళ్లు వచ్చారు. ఒక్కో పోటీదారుడి నుంచి రూ.3 వేలు సేకరించిన నిర్వాహకులు విందు, పసందులు ఏర్పాటుచేశారు. ఈ ఏడాది అంతకంటే ఎక్కువ ఏర్పాట్లలో నిర్వాహకులు నిమగ్నమైనట్టు సమాచారం. రాజకీయ పలుకుబడి ఉండడంతో అధికారులు అటువైపుగా చూడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై జేఆర్‌పురం ఎస్‌ఐ కంది నారాయణ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా కోడి పందాలు, పేకాట శిబిరాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టు తెలిపారు. కోటపాలెం, మరువాడ గ్రామాలపై ప్రత్యేకంగా దృషి ్టసారించామన్నారు. ఇప్పటికే 20 మందిపై బైండోవర్‌ కేసులు నమోదుచేసినట్టు తెలిపారు. ఎక్కడైనా ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తే  6309990850 నంబరుకు సమాచారమందించాలని సూచించారు.


 పొట్టేళ్ల పందెంరాయుళ్ల అరెస్ట్‌

 పొట్టేళ్ల పందాలకు సిద్ధమవుతున్న పది మందిని వంగర పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.6,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొప్పరవలసలో పొట్టేళ్ల పందాలు నిర్వహిస్తున్నారని సోమవారం సాయంత్రం పోలీసులకు సమాచారమందింది. దీంతో ఎస్‌ఐ చిరంజీవి సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. పోటీలకు సిద్ధమవుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఒక పొట్టేలుతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. 



Updated Date - 2021-01-12T06:07:05+05:30 IST