నాసిరకం బియ్యంపై లబ్ధిదారుల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-24T05:08:21+05:30 IST

కేంద్ర ప్రభుత్వం నవంబరు నెలకు సరఫరా చేసిన బియ్యం నాసిరకం గా ఉండడంతో లబ్ధిదారులు ఆం దోళనకు దిగారు. పట్టణ పరిధి లోని చీపురుపల్లి రేషన్‌ డిపో ద్వారా బియ్యం పంపిణీ చేపడుతున్నారు. అయితే ఈ బియ్యం ఎలా తినేదని లబ్ధిదారులు డీలర్‌ను నిలదీశారు.

నాసిరకం బియ్యంపై లబ్ధిదారుల ఆందోళన
ఆందోళనకు దిగిన లబ్ధిదారులు

రాజాం, నవంబరు 23: కేంద్ర ప్రభుత్వం నవంబరు నెలకు సరఫరా చేసిన బియ్యం నాసిరకం గా ఉండడంతో లబ్ధిదారులు ఆం దోళనకు దిగారు. పట్టణ పరిధి లోని చీపురుపల్లి రేషన్‌ డిపో ద్వారా బియ్యం పంపిణీ చేపడుతున్నారు. అయితే ఈ బియ్యం ఎలా తినేదని లబ్ధిదారులు డీలర్‌ను నిలదీశారు. ఈ విషయమై సివి సప్ల య్‌ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి మంచిరకం బియ్యం అందించేలా చర్యలు తీసు కుంటానని డీలర్‌ ఎంతచెప్పినా లబ్ధిదారులు శాంతించలేదు. మండలంలో అన్ని డిపోలకు మంచిరకం బియ్యం సరఫరా చేశారని, ఈ డిపోకి నాశిరకం బియ్యం ఎలా వచ్చాయని లబ్ధిదారులు ప్రశ్నించారు. అలాగే బయోమెట్రిక్‌కు సర్వర్‌ పనిచేయకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వారు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 

  

Updated Date - 2021-11-24T05:08:21+05:30 IST