పంటకోత ప్రయోగాలతో మేలు
ABN , First Publish Date - 2021-11-22T05:12:42+05:30 IST
పకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంటకోత ప్రయోగాలు దోహదం చేస్తాయని అర్ధ గణాంకశాఖ జేడీ ఎల్.కోదండరావు తెలిపారు. పాగో డు వద్ద ఆదివారం చేపట్టిన పంటకోత ప్రయోగాన్ని పరిశీలించారు.

అర్ధగణాంకశాఖ జేడీ కోదండరావు
జలుమూరు, నవంబరు 21: పకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు పంటకోత ప్రయోగాలు దోహదం చేస్తాయని అర్ధ గణాంకశాఖ జేడీ ఎల్.కోదండరావు తెలిపారు. పాగో డు వద్ద ఆదివారం చేపట్టిన పంటకోత ప్రయోగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటకోత ప్రయోగం వల్ల దిగుబడి అంచనా వేయడం ద్వారా పంట నష్టపోయిన రైతులకు బీమా వర్తిస్తుందన్నారు. జిల్లాలో 989 యూనిట్లలో 4,330 పంటకోత ప్రయోగాలు చేపడుతున్నట్లు చెప్పారు. తుఫాను ప్రభావం వల్ల పంటకోత ప్రయోగాలు చేపట్టడం ఆలస్యమైందన్నారు. పాగోడు వద్ద చేపట్టిన పంటకోత ప్రయోగంలో 9.250 కేజీలు దిగుబడి వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీఎస్‌వో వరహాలరావు, ఏఎస్‌వో బుచ్చిబాబు, ఏవో కె.సురేష్, సర్పంచ్ దామ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.