మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2021-02-07T05:06:12+05:30 IST

పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ దాఖలు మూడోవిడత నమోదు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. జిల్లాలోని వివిధ పంచాయతీల నుంచి సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవులకు పోటీచేసే వ్యక్తులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద వివిధ పార్టీల మద్దతుదారులతో సందడి నెలకొంది.

మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

రేగిడి, ఫిబ్రవరి 6: మండలంలో 39 పంచాయతీలకు గాను శనివారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులు 320 మంది నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో సర్పంచ్‌లకు 75,  362 వార్డు మెంబర్లకు 245 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో జేజీ స్టిఫెన్‌సన్‌ తెలిపారు. 9 కేం ద్రాల్లో నామినేషన్లు స్వీకరించామన్నారు. అయితే దేవుదళ, కోడిశ, ఆమ దాలవలస, ఉంగ రాడ, ఒప్పంగి, కొమిర, ఖండ్యాం, ఆడవరం తదితర 11 పంచాయతీల్లో తొలిరోజే ఒక్క నామినేషన్‌ కూడాదాఖలు కాలేదు. 


పొందూరు:  పొందూరు మండలంలో 29 పంచాయతీలకు 13 కేంద్రాల్లో  నామినే షన్లు స్వీకరిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 


సరుబుజ్జిలి: మండలంలోని 21 పంచాయతీల పరిధిలో తొలిరోజు సర్పంచి అభ్యర్థులుగా 52 మంది, వార్డు సభ్యులుగా 151 మంది నామినేషన్లు వేసినట్లు ఎంపీడీవో పి.మురళీమోహన్‌కుమార్‌  తెలిపారు. బూర్జ మండలంలోని 30 పంచాయతీలకు గాను 28 పంచాయ తీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీచేశారు. ఈ మేరకు సర్పంచ్‌లకు  66 మంది, వార్డు సభ్యులకు 154 మంది నామినేషన్లు వేసి నట్లు ఎంపీడీవో సురేష్‌ తెలిపారు.   


ఆమదాలవలస రూరల్‌: మండలంలో సర్పంచ్‌లకు 81 మంది, 234 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీవో పేడాడ వెంకట రాజు, తహసీల్దార్‌ జి.శ్రీని వాసరావు తెలిపారు. మండలంలో 11 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నామని అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి వి.పద్మ చెప్పారు.  


 పాలకొండ: మండలంలోని 32 పంచాయ తీలకు గాను శనివారం నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 21 పంచాయతీల నుంచి 56 మంది సర్పంచ్‌ పదవులకు, 150 మంది వార్డు సభ్యు లకు నామినేషన్లు దాఖలు చేశారు. మండల ప్రత్యేకాధికారి బి.రాజగోపాల్‌, ఎంపీ డీవో ఆనందరావు, తహసీల్దార్‌ నామినేషన్‌ కేంద్రాలను పరిశీలించారు. వీరఘట్టం మండలంలోని 34 పంచాయతీలకు 33 మంది సర్పంచ్‌ పదవులకు, 120 మంది వార్డు సభ్యులకు నామినేషన్‌ దాఖలు చేశారు.    


భామిని: మండలంలోని 27 పంచాయతీలకు 55 మంది సర్పంచ్‌ పదవికి, 242 వార్డులకు 116 మంది నామి నేషన్లు వేసినట్లు ఎంపీడీవో పైడమ్మ తెలిపారు.  


 సీతంపేట: మండలంలోని 53 పంచాయతీలకు 35 మంది సర్పంచ్‌ లుగా, 41 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు వేసినట్లు మండల ప్రత్యేకాధికారి బి.శ్రీనివాసరావు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు విలేకరులకు తెలిపారు.

 

Updated Date - 2021-02-07T05:06:12+05:30 IST