చిల్లర రాజకీయాలు మానుకోండి
ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST
సోంపేటలో అభివృద్ధి చేసి చూపిస్తే ప్రజలే హర్షిస్తారని, వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తే బుద్ధి చెబుతారని టీడీపీ నా యకులు హితవుపలికారు.

సోంపేట: సోంపేటలో అభివృద్ధి చేసి చూపిస్తే ప్రజలే హర్షిస్తారని, వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తే బుద్ధి చెబుతారని టీడీపీ నా యకులు హితవుపలికారు. శనివారం సోంపేటలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడ చెత్తసంస్కృతికి తెరలేపి చిల్లరరాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులకు మమ్మల్ని విమర్శించే హక్కులేదన్నారు. మాజీ ఎంపీపీ ఇంటి ముందు చెత్తవేయించడం వంటి రాజకీయాలు చేస్తామంటే కుదరదన్నారు.పంచాయతీకి కార్యాలయానికి ఎమ్మెల్యే వెళ్లిన సమయంలో వైసీపీ నాయకుల ప్రవర్తించిన తీరు సరిదిద్దాల్సిందిపోయి తిరిగి ఆయన్నే తప్పుపట్టడం వారి కుటిల రాజకీయానికి అద్దం పడుతోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. సోంపేట మెయిన్ రోడ్డు వ్యవహారంలో ఎమ్మెల్యే విజిలెన్స్ విచారణ వేయించారని, ఈ విషయంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పే ఽధైర్యంలేని వైసీపీ నాయకులు ఎమ్మెల్యేను విమర్శిస్తారా అని ప్రశ్నించారు. సమావేశంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూరాడ చంద్రమోహన్, టీడీపీ మండలాధ్యక్షుడు మద్దిల నాగేశ్, చిత్రాడ శేఖర్, బీన ఆనంద్ పాల్గొన్నారు.