తప్పుడు ప్రకటనలను మానుకోండి

ABN , First Publish Date - 2021-10-26T04:53:21+05:30 IST

ఉత్కరాంధ్రుల ఆరాధ్యదైవం నీలమణి దుర్గ ఆలయానికి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇచ్చినట్లు ప్రకటనలు చేసి కూలగొట్టడం దారుణమని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ను కలిసి నష్టపరిహారం విషయమై చర్చించారు. పరిహారం చెల్లించకుండా దేవాలయాన్ని ఎలా కూలగొడతారని ఆయన ప్రశ్నించారు.

తప్పుడు ప్రకటనలను మానుకోండి
తహసీల్దార్‌తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి

నీలమణి దుర్గ ఆలయానికి పరిహారం ఎప్పుడిచ్చారు?

తహసీల్దార్‌ను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కలమట రమణ

పాతపట్నం, అక్టోబరు 25: ఉత్కరాంధ్రుల ఆరాధ్యదైవం నీలమణి దుర్గ ఆలయానికి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇచ్చినట్లు ప్రకటనలు చేసి కూలగొట్టడం దారుణమని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ అన్నారు. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ను కలిసి నష్టపరిహారం విషయమై చర్చించారు. పరిహారం చెల్లించకుండా దేవాలయాన్ని ఎలా కూలగొడతారని ఆయన ప్రశ్నించారు. దీనిపై తహసీల్దార్‌ స్పందిస్తూ.. కాలావాలా ద్వారా ఎల్‌ఏ అకౌంట్‌కు రూ.1.40 కోట్లు జమ చేశారని, ఈ నిధులను ఈవో తదుపరి చర్యలు చేపట్టి పొందాల్సి ఉంటుందని వివరించారు. కలమట మాట్లాడుతూ.. 2020 అక్టోబరులో ఈ నిధులు చెల్లించినట్లు ప్రభుత్వం ప్రకటన చేయడం దారుణమన్నారు. పరిహారం చెల్లించకుండానే దేవాలయం తొలగింపు పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆలయానికి నష్టం వాటిల్లినా జిల్లా స్థాయి నుంచి డివిజన్‌ స్థాయి వరకు ఉన్న ఏ అధికారులు పరిశీలించకపోవడం విచారకమన్నారు. ఆయనతో పాటు టీడీపి మండల అధ్యక్షుడు పైల లక్ష్మయ్య, నేతలు  దువ్వారి ఉదయ్‌ భాస్కర్‌,  పైల బాబ్జీ నల్లి లక్ష్మణ తదితరులున్నారు.

 

Updated Date - 2021-10-26T04:53:21+05:30 IST