అన్నిరంగాల్లో యువతదే పైచేయి

ABN , First Publish Date - 2021-08-27T06:34:19+05:30 IST

మానవాళి జీవ నశైలికి అనుగుణంగా అన్నిరంగాల్లో నూతన ఒరవడిని సృష్టిస్తున్న భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా ఖ్యాతిని గడించిందని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు

అన్నిరంగాల్లో యువతదే పైచేయి
వర్చువల్‌లో భారత ఉప రాష్ట్రపతి సందేశాన్ని వింటున్న ఎంపీ రంగయ్య, వీసీలు కోరి, రంగజనార్దన్‌లు

విశ్వ గురువుగా భారత్‌

అన్నిరంగాల్లో యువతదే పైచేయి

 మాతృభాషలోనే  విద్యాబోధన జరగాలి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఘనంగా సెంట్రల్‌ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం

అనంతపురం అర్బన్‌, ఆగస్టు 26: మానవాళి జీవ నశైలికి అనుగుణంగా అన్నిరంగాల్లో నూతన ఒరవడిని సృష్టిస్తున్న భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా ఖ్యాతిని గడించిందని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గురువారం కేంద్రీయ విశ్వవిద్యాలయ(సెంట్రల్‌ యూనివర్సిటీ) వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతితోపాటు కేంద్ర విద్యాశాఖమంత్రి సుభాష్‌ సర్కార్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. ఆఫ్‌లైన్‌ ద్వారా ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్రపతి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యంగా పేరుగాంచిన రాయలసీమలోని అనంతపురంలో ఏర్పాటు చేసిన కేంద్రీ య విశ్వవిద్యాలయం సరికొత్త ఆవిష్కరణలు చేపట్టేలా విద్యార్థులను ప్రోత్సహిస్తోందన్నారు. దేశాభివృద్ధిలో ఉన్నత విశ్వవిద్యాలయాలు ముఖ్యభూమిక పోషిస్తాయన్నారు.  నూతన జాతీయ విద్యావిఽధానం అమలుతో అందరికి మెరుగైన విద్య అందుతుందన్నారు. మాతృభాషలో విద్యను బోధించడం ద్వారా విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారన్నారు. ప్రపంచంలోని అన్నిరంగాల అభివృద్ధి విద్యపైనే ఆధారపడి ఉందన్నారు. భవిష్యత్తును సులభతరం చేసేలా పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించినవారు భారతదేశంతో పా టు ప్రపంచ వ్యాప్తంగా రాణిస్తున్నారన్నారు. అన్నిరంగాల్లో యువతదే పైచేయి అన్నారు. ఇందుకు విశ్వవిద్యాల యా లు వారధిగా పనిచేస్తున్నాయన్నారు.


నూతన శకానికి నాంది 

- సుభాష్‌ సర్కార్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి

అనంతపురంలో ఏర్పాటుచేసిన సెంట్రల్‌ యూనివర్సిటీతో ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యారంగంలో నూతన శకానికి నాంది పడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాష్‌ స ర్కార్‌ పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో పాటు పలు రాష్ర్టాల్లో ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయాలు మూడేళ్లలోనే గుర్తింపు సాధించడం సంతోషదాయకమన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి వివిధ అం శాలలో అనంతపురం సెంట్రల్‌ యూనివర్సిటీ రెండు వెబ్‌నార్‌లు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ప్రగతి వేగంలో ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ ర్యాంకింగ్‌లో త్వరలోనే చోటు సంపా దిస్తుందన్నారు. వర్సిటీ వైస్‌ చాన్సెలర్‌ ఎస్‌ఏ కోరి, బోధన, బోధనేతర సిబ్బంది సెంట్రల్‌ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దడానికి కృషి చేయడాన్ని అభినందిస్తున్నా నన్నారు.


ఎడ్యుకేషనల్‌ హబ్‌గా అనంతపురం 

-  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్‌

 రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన అనంతపురం ఎడ్యుకేషనల్‌ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. జిల్లాలోని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లర్నింగ్‌, ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వీటితోపాటు సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రముఖ విద్యాకేంద్రంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర చరిత్రలో లిఖించేవిధంగా 2018 ఆగస్టు 5వ తేదీన అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీని ప్రారంభించారన్నారు. శాశ్వత భవన నిర్మాణాలకు బుక్కరాయసము ద్రం జంతులూరులో 491 ఎకరాల స్థలాన్ని కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాన్ని నిలబెట్టుకుందన్నారు. అనంతపురం ప్రాంతంలో ఏర్పాటుచేసి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జా తీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో కచ్చితం గా అమలుచేస్తామన్నారు.


సమాజాభివృద్ధిలో ఉన్నత విద్యాసంస్థలది ముఖ్యపాత్ర 

-  ఎంపీ తలారి రంగయ్య

సమాజ అభివృద్ధిలో ఉన్నత విద్యాసంస్థలు ముఖ్యపా త్ర పోషిస్తాయని ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీ అభివృద్ధే తన మొదటి ప్రాధాన్యత అన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు తమ నైపుణ్యాలను సమాజంలోకి తీసుకెళ్లాలన్నారు. ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌ కింద సెంట్రల్‌ యూనివర్సిటీ ఆరు గ్రామాలను దత్తత తీసుకోవడం సంతోషదాయకమన్నారు. జాతీయ నూతన విద్యావిధానం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, సమానమైన విద్య అందుతుందన్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన అదనపు చర్యలను సెంట్రల్‌ యూనివర్సిటీ అవృద్ధికి అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తానని పేర్కొన్నారు. జేఎన్‌టీయూ నుంచి ఆఫ్‌లైన్‌లో నిర్వహించి న ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌చాన్సె లర్‌ ఎస్‌ఏ కోరి, జేఎన్‌టీయూ వీసీ రంగ జనార్దన, ప్రొఫె సర్లు ఆంజనేయస్వామి, రాజేంద్రప్రసాద్‌, రామ్‌రెడ్డి, హునుమాన్‌ కెన్నడి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-27T06:34:19+05:30 IST