లబ్ధిదారులకు హుద్‌హుద్‌ ఇళ్లు అప్పగించండి

ABN , First Publish Date - 2021-08-10T05:32:41+05:30 IST

లబ్ధిదారులకు హుద్‌హుద్‌ ఇళ్లు అప్పగించండి

లబ్ధిదారులకు హుద్‌హుద్‌ ఇళ్లు అప్పగించండి
జేసీకి సమస్యను వివరిస్తున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

- ‘ కలెక్టర్‌ స్పందన’లో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వినతి

కలెక్టరేట్‌ : హుద్‌హుద్‌ ఇళ్లను గత ప్రభుత్వం లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు అప్పగించాలని మాజీ ఎమ్మెల్యే గండ లక్ష్మీదేవి కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘కలెక్టర్‌ స్పందన’లో జేసీ సుమిత్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హుద్‌హుద్‌ తుఫాన్‌లో నష్ట పోయిన మత్స్యకారులకు టీడీపీ హయాంలో కుందవా నిపేట వద్ద 288 ఇళ్ల మంజూరు చేశామని, వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను 2018లో అప్పటి కలెక్టర్‌ కు అందజేశామన్నారు. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు తాళాలు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. 

- మైనింగ్‌ పరిశ్రమకు ప్రభుత్వం రాయితీలు కల్పించి ఆదుకోవాలని జిల్లా గ్రానైట్‌ పరిశ్రమ అసోసియేషన్‌ సంఘ నాయకులు జేసీ కె.శ్రీనివాసులకు వినతిపత్రం అందించారు. 

- కోటబొమ్మాళి మండలం కొండపేట ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తక్షణమే విడుదల చేయాలని రైతు కూలి సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం జేసీ కె.శ్రీనివాసులకు వినతిపత్రం అందించారు. వీటితోపాటు జిల్లా నలుమూలల నుంచి వ్యక్తిగత సమస్యలపైనా వినతులు అందాయి.  కార్యక్రమంలో డీఆర్వో బి.దయానిధి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-10T05:32:41+05:30 IST