గంజాయి కేసుల్లో ఒకరి అరెస్టు
ABN , First Publish Date - 2021-12-31T05:47:53+05:30 IST
గంజాయి కేసుల్లో ఒకరి అరెస్టు

ఆమదాలవలస : గతంలో పట్టుబడిన రెండు గంజాయి కేసుల్లో ఒకరిని పోలీసులు అరె స్టు చేశారు. గురువారం సీఐ పల్లా పైడయ్య ఇందుకు సంబంధించిన వివరాలను విలేఖరులకు వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబరు 23న పశ్చిమబెంగాల్‌కు చెందిన నలుగురు 48 కిలోల గంజాయిని తరలిస్తుండగా ఆమదాలవలస రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసులకు పట్టుపడ్డారు. నవంబరు 20న 42 కేజీల గంజాయి తరలిస్తుండగా మరో ముగ్గుర్ని పట్టుకున్నారు. అప్పట్లోనే ఈ కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వారంతా విశాఖకు చెందిన ఆహారుద్దీన్ షేక్ (సమీర్‌షేక్) సరఫరా చేస్తున్నట్టు పోలీసులకు చెప్పారు. అప్పటి నుంచి ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి నిఘా పెట్టగా ఆమదాలవలసలో పట్టుబడినట్టు సీఐ తెలిపారు.
బ్యాటరీ చోరీ కేసులో మరొకరు...
వంగర : అరసాడలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ బ్యాటరీ చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ దేవానంద్ గురువారం తెలిపారు. ఈ మేరకు అతన్ని డిమాండ్‌కు తరలించామన్నారు.