ఆందోళనకారులపై కేసు నమోదు: ఏసీపీ

ABN , First Publish Date - 2021-07-25T05:20:40+05:30 IST

ఆందోళనకారులపై కేసు నమోదు: ఏసీపీ

ఆందోళనకారులపై కేసు నమోదు: ఏసీపీ

పరకాల, జూలై 24: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని వ్యక్తిగతం గా అవమాన పరిచిన ఆరుగురు ఆందోళనకా రులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం స్థానిక పో లీస్‌ స్టేషన్‌లో విలేఖ రుల సమావేశంలో మాట్లాడుతూ అమరవీ రుల జిల్లాగా పరకాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 14న పట్టణంలోని అ మరధామంలో సాధన సమితి ఏర్పాటు చేసిన సమావే శంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వ్యక్తిగతంగా అవమాన పరిచి నందుకు టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు బండి సారంగపాణి ఫిర్యాదు  చేశారన్నారు. ఈ మేరకు కోయ్యాడ శ్రీనివాస్‌, దు బాసి వెంకటస్వామి, పిట్ట వీరస్వామి, మార్త భిక్షపతి, ఆర్‌ పి. జయంత్‌లాల్‌, దేవునూరి మేఘనాథ్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తూ స్టేషన్‌ బేయిల్‌ పై విడుదల చేశామ న్నారు. కార్యక్రమంలో సీఐ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T05:20:40+05:30 IST