ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-02-06T05:05:38+05:30 IST

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు.

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు: కలెక్టర్‌
కవిటి: అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

కవిటి, ఫిబ్రవరి 5: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎన్నికల సామగ్రి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని కల విధుల్లో ఉన్న సిబ్బందికి రెండు దఫాల శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. పోలీసుల సహకారంతో ఎన్నికలు సజావుగా నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని తెలి పారు. నిఘా కోసం 38 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, 30 చెక్‌ పోస్టులు, మండలానికి జోనల్‌ అధికారిని నియమిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగ ఓటర్ల కోసం ట్రై సైకిళ్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో 11,059 పోలింగ్‌ కేంద్రాల్లో 30,252 మంది సిబ్బంది, 25,160 మంది పోలింగ్‌ అధికారులను నియమించినట్టు తెలిపారు. జిల్లాలో మెదటి విడత పోలింగ్‌ 10శాతం మేర ఏక గ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకోవడం జరిగిందన్నారు. 321 పంచాయతీలకు గాను 290 వరకు ఎన్నికలు జరగనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.సూర్య నారాయణ, తహసీల్దార్‌ ఆర్‌.అప్పల రాజు, ఆర్‌ఐ జీవన్‌, ఏవో రామారావు పాల్గొన్నారు.   ఇచ్ఛాపురం/ఇచ్ఛాపురం రూరల్‌: చెక్‌పోస్టు వద్ద సిబ్బంది ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. శుక్రవారం ఇచ్ఛాపురం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల నేపఽథ్యంలో ఒడిశా నుంచి మద్యం, సారా, డబ్బు రవాణాపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఆదేశిం చారు. అనంతరం ఇచ్ఛాపురంలో పోలింగ్‌ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మురళీమోహన్‌, ప్రత్యేకాధికారి వెంకటేష్‌, ఎంపీడీవో బి.వెంకటరమణ పాల్గొన్నారు.  వజ్రపుకొత్తూరు: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ జె.నివాస్‌ మండల అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాయలంలో స్టేజ్‌-2 ఎన్నికల అధికారుల శిక్షణ తరగతులను శుక్రవారం సందర్శించారు. అనంతరం వజ్రపుకొత్తూరు హైస్కూల్‌ వద్ద ఏర్పాట్లను పరిశీ లించారు. మౌలిక వసతులపై తహసీల్దార్‌ అప్పల స్వామి, ఎంపీడీవో ఈశ్వరమ్మలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్ర మంలో ప్రత్యేకాధికారి రవికృష్ణ పాల్గొన్నారు.
బాధ్యతగా  వ్యవహరించండి:  జేసీ శ్రీనివాసులు
రాజాం:
పంచాయతీ ఎన్నికల విధుల్లో అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని జాయింట్‌ కలెక్టర్‌ కె. శ్రీనివాసులు ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళా శాలలో శుక్రవారం పంచాయతీ ఎన్నికలపూ స్టేజ్‌-2 సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ లో ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్వో ఎం.జగన్నాథం, అసి స్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు బాసూరు శంకరరావు, పి.వేణు గోపాలరావు పాల్గొన్నారు.
సజావుగా ఎన్నికలకు సహకరించండి
అల్లాడపేట(జలుమూరు):
గ్రామాల్లో ఎటువంటి ఘర్షణలకు తావులేకుండా ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని శ్రీకాకుళం డీఎస్పీ ఎం.మహేంద్ర అన్నారు. శుక్రవారం అల్లాడపేట, సైరిగాం గ్రామాల్లో ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అలజడులు సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ కలిసి మెలిసి జీవించాలని అలాంటప్పుడు కక్షలు, ప్రతీకారాలకు తావుండదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో నరసన్నపేట సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్‌ఐ వై.కృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.   స్థానిక ఎన్నికలు నిర్వహణలో రూటు, జోనల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో ఎ.దామోదరరావు కోరారు. మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.  
ఓటర్లకు అసౌకర్యం లేకుండా చర్యలు
హిరమండలం (ఎల్‌.ఎన్‌.పేట):
పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండా మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆర్డీవో ఐ.కిశోర్‌ అన్నారు. ఎల్‌ ఎన్‌పేట మండలం సుమంతాపురం, కృష్ణాపురం, తురకపేట పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం పరిశీలిం చారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 9న జరగబోయే పంచా యతీ ఎన్నికల్లో ఓటర్లందరూ  ఓటుహక్కును స్వేచ్ఛగా వేసు కొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు, అవాంఛ నీయ సంఘట నలు జరగకుండా ఉండేలా పోలీసు బందో బస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆయ నతో పాటు తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Updated Date - 2021-02-06T05:05:38+05:30 IST