కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు పక్కా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-01-12T06:07:33+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి పక్కాఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా, బందోబస్తును ప్రణాళికలో చేర్చాలని సూచించారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు పక్కా ఏర్పాట్లు
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ నివాస్‌

అధికారులతో సమీక్షలో కలెక్టర్‌ నివాస్‌ 

కలెక్టరేట్‌ : జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి పక్కాఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. సోమవారం శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై టాస్క్‌ఫోర్స్‌ కమిటీతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా, బందోబస్తును ప్రణాళికలో చేర్చాలని సూచించారు. వ్యాక్సిన్‌ రవాణాకు వాహనాలు అందుబాటు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ సూచనలు, నిబంధ లకు అనుగుణంగా ఏర్పాట్లు జరగాలన్నారు. వ్యాక్సిన్‌ నిల్వచేసే గదికి సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి వెబ్‌కు అనుసంధానం చేయాలని తెలిపారు. రేయింబవళ్లు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మొదటి, రెండో, మూడో దశల్లో వ్యాక్సిన్‌ ఇచ్చే వారి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. వార్డు, గ్రామ సచివాలయ విభాగం జేసీ కె.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరో గ్యశాఖ కార్యాలయంలో వ్యాక్సిన్‌ నిల్వకు సిద్ధంచేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి నుంచి నుంచి కోల్డ్‌చైన్‌ కేంద్రాలకు రవాణా అవుతుందని తెలిపారు. వ్యాక్సిన్‌ నిల్వకు అన్ని నియోజకవర్గాల్లో 18 కేంద్రాలను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఆమోదం తెలిపిందన్నారు.మొదటి దశలో దాదాపు 20 వేలు మంది వైద్య సిబ్బందికి, రెండోదశలో ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు సుమారు 50 వేలు మందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కేసీ చంద్రనాయక్‌, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాథరావు. వైద్యాధికారి భారతీ కుమారీదేవి  పాల్గొన్నారు. 

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

రణస్థలం : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దాలని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. సోమవారం జేఆర్‌పురం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం వినియో గించుకోవాలని కోరారు. అనంతరం జేఆర్‌పురం సచివాలయాన్ని పరిశీలించారు. ప్రతి అధికారి బయోమెట్రిక్‌ విధిగా వేయాలని  ఆదేశించారు. అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వపథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తహసీల్దార్‌ ఎం.సుధారాణి,  ఎంఈవో త్రినాథరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-12T06:07:33+05:30 IST