ముగ్గురు డీఎస్పీల నియామకం

ABN , First Publish Date - 2021-02-07T04:09:04+05:30 IST

జిల్లాలో మూడు విభాగాలను భర్తీచేశారు. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీగా బి.నాగేశ్వరరావు, సెంటర్‌ క్రైం స్టేషన్‌

ముగ్గురు డీఎస్పీల నియామకం
ఎస్సీ, ఎస్టీ సెల్‌, సీసీఎస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌లో ఖాళీల భర్తీ
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 6 :
జిల్లా పోలీస్‌ శాఖలో కీలక విభాగాలకు సంబంధించి డీఎస్పీలను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్పీల నియామకాల్లో భాగంగా జిల్లాలో మూడు విభాగాలను భర్తీచేశారు. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న శ్రీకాకుళం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీగా బి.నాగేశ్వరరావు, సెంటర్‌ క్రైం స్టేషన్‌ డీఎస్పీగా జి.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. అలాగే  ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీగా సీహెచ్‌ శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. త్వరలోనే వీరంతా విధుల్లో చేరే అవకాశముంది.Updated Date - 2021-02-07T04:09:04+05:30 IST