రాష్ట్రంలో అరాచక పాలన
ABN , First Publish Date - 2021-11-28T05:36:02+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన

- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ధ్వజం
పలాస : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ధ్వజమెత్తారు. చట్టసభల నుంచి సాధారణ సభల్లో వైసీపీ నాయకులు వ్యక్తి గత విమర్శలు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పా, ఏనాడైనా అభివృద్ధిపై సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. శనివారం పలాసలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమలో వరదల వల్ల ప్రజలు ప్రాణాలు పోతుంటే అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చి బాధితులకు న్యాయం చేయడం మరి చిపోయా రని విమర్శించారు.తమ నాయకుడు చంద్రబాబునాయుడు రాయలసీమలో పగులూ రాత్రి పర్యటిస్తున్నారని తెలిపారు. దీన్ని కూడా కొంతమంది మంత్రులు అపహాస్యం చేసేలా ప్రకటనలు ఇవ్వడం తగదన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండున్న రేళ్లలో ఆర్థికంగా దివాలా తీయించిందని, ఒక్కసారి అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కు వెళ్లి పోయిందని దుయ్య బట్టారు. సచివాలయాలకు రంగులు వేయడంతోనే కాలం గడిచి పోయిందన్నారు. ఉద్దా నంలో తితలీ తుఫాన్ సమయంలో ఇచ్చిన హామీని వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి మరిచి పోయారన్నారు. తుఫాన్ రెట్టింపు నష్ట పరిహారంపై నిలదీశారు. సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఒక్కపైసా కూడా ప్రభుత్వానికి చెల్లించవద్దన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, లొడగల కామేశ్వరరావు యాదవ్, మల్లా శ్రీనివాస్, గొరకల వసంతస్వామి పాల్గొన్నారు. కాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన మునిసిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావును పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. అలాగే బంటుకొత్తూరుకు చెందిన అంబలి భాస్కరరావును పాము కాటేయడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందు తున్నారు. దీంతో ఆయన్ని గౌతు శిరీష పరామర్శించారు.