టిప్పర్‌ ఢీకొని వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2021-11-29T05:27:36+05:30 IST

చల్లపేట గ్రామ సమీపంలో టిప్పర్‌ ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

టిప్పర్‌ ఢీకొని వృద్ధురాలి మృతి
వృద్ధురాలి మృతదేహం


టెక్కలి రూరల్‌: చల్లపేట గ్రామ సమీపంలో టిప్పర్‌ ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం ఉదయం టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న టిప్పర్‌ చల్లపేట సమీపంలో హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని ఢీ కొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచా రం మేరకు క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందు తూ మృతిచెందింది. మృతురాలు వివరాలు తెలియరా లేదు. ఈ మేరకు మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఉంచి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు.Updated Date - 2021-11-29T05:27:36+05:30 IST