అమరావతినే రాజధానిగా కొనసాగించాలి
ABN , First Publish Date - 2021-12-16T05:20:41+05:30 IST
రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నర్సింహులు డిమాండ్ చేశారు. అమరావతి రైతుల పాద్రయాత్ర ముగింపు సందర్భంగా వారికి సంఘీభావంగా బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. అమరావతినే ఏకైక రాజధానిగా సీఎం జగన్ ప్రకటించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ నేతలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు చాపర సుందర్‌లాల్, నాయకులు బలగ శ్రీరామ్మూర్తి, ఏఐటీయూసీ అధ్యక్షుడు గోవిందరావు, కార్యదర్శి లండ వెంకటరావు, డోల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.