పోలిపల్లి పైడితల్లి ఘటోత్సవం పులకించిన భక్తజనం
ABN , First Publish Date - 2021-03-24T05:38:52+05:30 IST
కున్నారు. సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడి ఉంది. జాతరలో కీలక ఘట్టంగా భావించే ఘటోత్సవం వేడుకగా జరిగింది. భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఘటాలతో పూజారి లంకలపల్లి సూర్యనారాయణ అమ్మవారి గుడిలోనికి ప్రవేశించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేమ

రాజాంలో ముగిసిన అమ్మవారి జాతర
రాజాం/రూరల్, మార్చి 23: పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. జాతరలో భాగంగా చివరి రోజు మంగళవారం ఘటోత్సవం వేడుకగా సాగింది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో బారులుదీరారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకూ ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడి ఉంది. జాతరలో కీలక ఘట్టంగా భావించే ఘటోత్సవం వేడుకగా జరిగింది. భక్తుల జయజయ ధ్వానాల నడుమ ఘటాలతో పూజారి లంకలపల్లి సూర్యనారాయణ అమ్మవారి గుడిలోనికి ప్రవేశించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ పర్యవేక్షించారు. ఎస్‌వీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు సలాది తులసీదాస్ తదితరుల సారధ్యంలో భారీగా బాణసంచా కాల్చారు. మధ్యాహ్నానికి బొబ్బిలి రోడ్డు నుంచి ఆలయం వరకూ భక్తులు బారులుదీరారు. అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలో రహదారి రద్దీగా మారింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు తాగునీరు, మజ్జిగ, ప్రసాదాలను అందించాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పాలకొండ డీఎస్పీ శ్రావణి, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. మంగళవారం ఉదయం విధుల్లో ఉన్న కొంతమంది పొలీస్ సిబ్బంది అతిగా వ్యవహరించారు. రూ.100 టికెట్ కౌంటర్ ద్వారా ఉచితంగా ఇష్టారాజ్యంగా పదుల సంఖ్యలో తమ బంధువులు, మిత్రులను ఆలయంలోనికి పంపించారు. ఇది విమర్శలకు తావిచ్చింది. అమ్మవారి జాతర ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, ఆలయవర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.