అగ్నికుల క్షత్రియులను ఎంబీసీలో చేర్చాలి

ABN , First Publish Date - 2021-10-28T05:53:10+05:30 IST

అగ్నికుల క్షత్రియులను ఎంబీసీలో చేర్చాలి

అగ్నికుల క్షత్రియులను ఎంబీసీలో చేర్చాలి
మాట్లాడుతున్న జుత్తు నీలకంఠం

హరిపురం : అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గాన్ని అత్యంత వెనుకబడిన (ఎంబీసీ) జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైౖర్మన్‌ జస్టిస్‌ శంకరనారాయణకు కోరినట్లు అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ డైరక్టర్‌ జుత్తు నీలకంఠం  కోరారు. బుధవారం జిల్లాలో పర్యటిస్తున్న బీసీ కమిషన్‌ను ఆ సామాజికవర్గం ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం  ఆర్థిక, విద్యా, రాజకీయపరంగా  వెనుకబడి ఉందని, తమ స్థితిగతులను గుర్తించి తగు న్యాయమని చేయాలని కోరా రు. తమ వినతిపై కమిషన్‌ చైర్మన్‌ సానుకూలంగా స్పందించారని చెప్పా రు. సంఘ జిల్లా కార్యదర్శి బచ్చల మధు, కోశాధికారి తిమ్మల ఉమా మహేశ్వరరావు, కృష్ణారావు, అప్పారావు, చంద్రశేఖరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:53:10+05:30 IST