అదుపులోకి కార్చిచ్చు
ABN , First Publish Date - 2021-05-09T03:59:52+05:30 IST
వెలుగొండల్లో చెలరేగిన మంటలు శనివారం అదుపులోకి వచ్చినట్లు రేంజర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

రాపూరు, మే 8: వెలుగొండల్లో చెలరేగిన మంటలు శనివారం అదుపులోకి వచ్చినట్లు రేంజర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. అడవులు, కొండల్లో పెరిగిన గడ్డి ఎండిపోవడంతో చిన్న ప్రమాదం జరిగినా దావానలంగా మారుతున్నట్లు తెలిపారు. ఘాట్‌రోడ్డు పరిధిలో కొండలమీద మంటలు రేగడంతో వరుసగా రెండు రోజులపాటు సిబ్బంది చెమటోడ్చి మంటలను అదుపుచేసినట్లు తెలిపారు.