ఆదిత్యుని ఆదాయం రూ.43,10,655

ABN , First Publish Date - 2021-10-30T03:48:36+05:30 IST

ఆదిత్యుని ఆదాయం రూ.43,10,655

ఆదిత్యుని ఆదాయం రూ.43,10,655
ఆదిత్యుని ఆలయంలో హుండీలు లెక్కిస్తున్న దృశ్యం

- రాత్రివరకు కొనసాగిన హుండీ లెక్కింపు

అరసవల్లి, అక్టోబర్‌ 29 : అరసవల్లి ఆదిత్యునికి హుండీల ద్వారా రూ.43,10,655 ఆదాయం లభించింది. గత నెల 6 నుంచి ఇప్పటివరకు  ఆలయంలోని హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ అనివెట్టి మండపంలో 90 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఇందులో 23 గ్రాముల బంగారం, రెండు కిలలో వెండి లభ్యమైంది. అమెరికా, సింగపూర్‌కు చెందిన 13 డాలర్లు లభించాయి. నోట్ల రూపంలో రూ.41,02,626, చిల్లర నాణేల రూపంలో రూ.2,08,029 ఆదాయం లభించింది. ఆదిత్యుని ఆలయ పాలకమండలి సమావేశం శనివారం ఆలయ ప్రాంగణంలో జరగనుంది. సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఈఓ హరిసూర్యప్రకాష్‌ కోరారు. కార్యక్రమంలో ఈవోతో పాటు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-30T03:48:36+05:30 IST