ఆదిత్యుని ఆదాయం రూ.38.9లక్షలు

ABN , First Publish Date - 2021-12-16T04:44:35+05:30 IST

అరసవల్లి సూర్యనారాయణ స్వామికి 45 రోజులకు గాను రూ.38,09,333 ఆదాయం లభించినట్లు ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. బుధవారం ఆలయ అనివెట్టి మండపంలో ఈవో ఆధ్వర్యంలో దేవదాయశాఖ సిబ్బంది ఆదిత్యుని హుండీలను లెక్కించారు.

ఆదిత్యుని ఆదాయం రూ.38.9లక్షలు
అరసవల్లిలో హుండీ ఆదాయం లెక్కిస్తున్న దృశ్యం

అరసవల్లి, డిసెంబరు 15: అరసవల్లి సూర్యనారాయణ స్వామికి 45 రోజులకు గాను  రూ.38,09,333 ఆదాయం లభించినట్లు ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. బుధవారం ఆలయ అనివెట్టి మండపంలో ఈవో ఆధ్వర్యంలో దేవదాయశాఖ సిబ్బంది ఆదిత్యుని హుండీలను లెక్కించారు. నోట్ల రూపంలో రూ.36,53,017, చిల్లర రూపంలో రూ.1,56,316 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. బంగారం 26 గ్రాములు, వెండి 1,450 గ్రాములు, 22 విదేశీ కరెన్సీ లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి చైర్మన్‌ ఇప్పిలి జోగిసన్యాసిరావు, సభ్యులు పాల్గొన్నారు. 

- విశాఖపట్నం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు బుధవారం ఆదిత్యుని దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్‌.. స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. 

 

శ్రీముఖలింగేశ్వరుని ఆదాయం రూ.8.47 లక్షలు

శ్రీముఖలింగం (జలుమూరు): కార్తీకమాసంలో శ్రీముఖలింగేశ్వర స్వామికి వివిధ రూపాల్లో  రూ.8,47,400 ఆదాయం వచ్చిందని ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం దేవదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీలను తెరిచి ఆదాయం లెక్కించారు. హుండీ ద్వారా .5,63,970 రాగా, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల్ల ద్వారా రూ..2,44,90, కేశ ఖండన ద్వారా రు.23,200, స్థల పురాణ పుస్తకాలు విక్రయాల ద్వారా రు.4,360, స్వామివారి ఫొటోల విక్రయం ద్వారా రూ.5,270, విరాళాల ద్వారా రూ.5,700 వచ్చిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ టి.సతీష్‌, అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, సింహాచలం, శివ, అచ్యుతరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T04:44:35+05:30 IST