అగ్రిల్యాబ్‌ పనుల్లో నాణ్యత పాటించండి

ABN , First Publish Date - 2021-06-23T05:21:21+05:30 IST

అగ్రిల్యాబ్‌ పనుల్లో నాణ్యత పాటించండి

అగ్రిల్యాబ్‌ పనుల్లో నాణ్యత పాటించండి
ఆమదాలవలస రూరల్‌: అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

ఆమదాలవలస రూరల్‌, జూన్‌ 22: అగ్రిల్యాబ్‌ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించా రు. మంగళవారం ఆమదాలవలస ఏఎంసీ ఆవరణలో నిర్మిస్తున్న అగ్రిల్యాబ్‌ పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించేందుకు అగ్రి హబ్‌లుగా అగ్రి ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట  డ్వామా పీడీ కూర్మారావు, వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌, డీడీ రాబర్ట్‌ పాల్‌, ఏడీ రవిప్రకాశ్‌ పాల్గొన్నారు.

-  వంజంగిపేటలో ఉపాధి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. వేతనదారులతో వేతనాలు, మస్తర్లను అడిగితెలుసుకున్నారు. అనంతరం నారాయణపురం 22ఎల్‌ కాలువ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీటి  సమస్యను  గ్రామస్థులు వివరించగా,  మూడునెలల్లో తాగునీరం దించాలని అధికారులను ఆదేశించారు.


సచివాలయాల్లోనే సేవలందించండి: జేసీ

భామిని: మండల కేంద్రాల్లోని కార్యాలయాలకు రాకుండా సచివాలయా ల్లోనే పూర్తిస్థాయిలో సేవలందించాలని జేసీ సుమిత్‌కుమార్‌ సిబ్బందిని ఆదే శించారు. మంగళవారం భామిని వెలుగు కార్యాలయంలో  అధికారులతో సమీ క్షించారు. ప్రజలకు అవసరమయ్యే అన్ని సేవలు సచివాలయం నుంచే అందా లన్నారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.   తహసీల్దార్‌ ఎస్‌.నరసింహమూర్తి, ఎంపీడీవో పైడమ్మ, పంచాయతీరాజ్‌ ఏఈ గౌరీశంకర్‌ పాల్గొన్నారు. సీతంపేట: కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సాధారణ రోగులకు చికిత్స అందజేయడానికి వైద్యులు అందుబాటులో ఉండాలని జేసీ సుమిత్‌కుమార్‌ కోరారు.  మంగళ వారం సీతంపేట ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు.  రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌  నరేష్‌కుమార్‌ను అడిగి తెలుసు కున్నారు. నూతనంగా నిర్మిస్తున్న ఏరియా ఆసుపత్రి భవన సముదాయ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ ఏపీవో లోకనాఽథం ఆనందరావు, తహసీల్దార్‌ రమేష్‌ కుమార్‌, వైద్యాధికారులు సునీల్‌కుమార్‌, రాజ్‌కుమార్‌, రాజేష్‌ ఉన్నారు. పాలకొండ రూరల్‌: ఓని, లుంబూరు గ్రామ సచివాలయాల పరిధిలో జరుగుతున్న  పంచాయతీ భవనం, ఆర్బీకే, వెల్‌నెస్‌ సెంటర్ల భవనాల పనుల ను మండల, గ్రామస్థాయి కమిటీలు మంగళవారం పరిశీలించాయి. త్వరగా పనులు పూర్తిచేయాలని ఎంపీడీవో జె.ఆనందరావు  ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా చూడాలన్నారు. జి.సిగడాం: మండ లంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో లక్ష్మీపతి ఆదేశించారు. గెడ్డకంచరాం, శేతుభీమవరం గ్రామాల్లో ఆయ న మంగళవారం పర్యటించారు. వివాదంలో ఉన్న గెడ్డకం చరాం ఆర్‌బీకే, శీతు భీమవరం హెల్త్‌సెంటర్‌ సమస్యలను పరిష్కరించారు.  అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎంపీడీవో ఐ.రమణ మూర్తి, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసులు, జేఈ శ్రీవల్లి, ఏపీవో సీహెచ్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

  

Updated Date - 2021-06-23T05:21:21+05:30 IST