పరిహారం చెల్లించాకే భూముల స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-30T05:14:49+05:30 IST

జగనన్న లేఅవుట్‌కు సేకరిస్తున్న భూములకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే స్వాధీనం చేసుకుంటామని జేసీ సుమిత్‌కుమార్‌ అన్నారు. కాలనీ నిర్మాణానికి బొడ్డపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో 150 ఎకరాలు భూమిని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రైతులతో సమావేశం నిర్వహించారు.

పరిహారం చెల్లించాకే భూముల స్వాధీనం
రైతులతో మాట్లాడుతున్న జేసీ సుమిత్‌కుమార్‌

జేసీ సుమిత్‌కుమార్‌

పలాసరూరల్‌ : జగనన్న లేఅవుట్‌కు సేకరిస్తున్న భూములకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే స్వాధీనం చేసుకుంటామని జేసీ సుమిత్‌కుమార్‌ అన్నారు. కాలనీ నిర్మాణానికి బొడ్డపాడు రెవెన్యూ గ్రామ పరిధిలో 150 ఎకరాలు భూమిని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా బొడ్డపాడు సర్పంచ్‌ తామాడ మదన్‌, మాజీ సర్పంచ్‌ తామాడ త్రిలోచనరావు, బొడ్డు సుధాకర్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు మద్దిల మల్లేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో టిడ్కో ఇళ్లు, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు కాలనీలు, వ్యవసాయ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం వందలాది ఎకరాలు తీసుకున్నా నేటికీ పరిహారం చెల్లించ లేదన్నారు. అధికారులు మారుతున్నారు తప్ప పరిహారం అందడంలేద న్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారంతో పాటు రైతులకు ఇళ్ల స్థలం మంజూరు చేయాలన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ.. అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని, పరిహారం అందిన తర్వాతే భూములు తీసుకుం టామని హామీ ఇచ్చారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌, తహసీల్దార్‌ మధుసూదనరావు, ఆర్‌ఐ రవి, రైతులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-10-30T05:14:49+05:30 IST