ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-08-11T05:02:23+05:30 IST

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశించారు. మంగళవారం కాశీబుగ్గలో జేసీ సుమిత్‌ కుమార్‌, హౌసింగ్‌ జేసీ హిమాన్షు కౌషిక్‌ ఆధ్వర్యంలో టెక్కలి డివిజన్‌ స్థాయి హౌసింగ్‌ అధికారులతో సమీక్షించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం యజ్ఞంలా చేపట్టాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

మంత్రి సీదిరి అప్పలరాజు

కాశీబుగ్గ: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని  మంత్రి సీదిరి అప్పలరాజు ఆదేశించారు. మంగళవారం కాశీబుగ్గలో జేసీ సుమిత్‌ కుమార్‌, హౌసింగ్‌  జేసీ హిమాన్షు కౌషిక్‌ ఆధ్వర్యంలో టెక్కలి డివిజన్‌ స్థాయి హౌసింగ్‌ అధికారులతో సమీక్షించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం యజ్ఞంలా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్‌, డ్వామా పీడీలు కూర్మనాఽథ్‌, కూర్మారావు, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌, టెక్కలి పలాస, ఇచ్ఛాపురం ఆర్‌డబ్ల్యూఎస్‌, ట్రాన్స్‌కో, డ్వామా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, కమిషనర్లు పాల్గొన్నారు.


బాల్‌ బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి కృషి  

పలాస: బాల్‌ బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి  కృషిచేస్తానని మంత్రి అప్పలరాజు తెలిపారు. మంగళవారం బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌  రాష్ట్ర  అధ్యక్షుడు తోట మనోహర్‌ మంత్రిని కలుసుకున్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, బాల్‌ బ్యాడ్మింటన్‌ జిల్లా అధ్యక్షుడు కోత పూర్ణచంద్రరావు, ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీష్‌కుమార్‌  తదితరులు పాల్గొన్నారు. 


సరిహద్దు గ్రామాల సమస్యలను పరిష్కరించండి

హరిపురం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మాణిక్యపట్నం, సింగుపురం, కొండమోర, గుడ్డికోల గ్రామాల సమస్యలను పరిష్కరించాలని మంత్రి  అప్పలరాజుకు  గిరిజన సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు సంఘ నాయకులు తిరుపతిరావు, ఎస్‌.ధర్మారావు, గురునాథరావు, బికారి, గిరి, భాస్కర్‌  మంత్రికి వినతిపత్రం అందజేశారు. మాణిక్యపట్నంలో ఇటీవల ఎన్నికల్లో ఓ మహిళా వార్డుసభ్యురాలు పోటీ చేసినా ఒడిశా అధికారులు  నామినేషన్‌ ఉపసంహరించేలా చేశారని, సింగుపురం శ్మశాన వాటికను ఆక్రమించుకున్నారని వివరించారు. ఈ విషయమై ఐటీ డీఏ అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించు కోవడంలేదని వాపోయారు.

  

Updated Date - 2021-08-11T05:02:23+05:30 IST