ఉపాధ్యాయుడుని నియమించాలి

ABN , First Publish Date - 2021-11-28T05:43:43+05:30 IST

కొమ్మువల స పాఠశాలకు ఉపాధ్యాయుడుని నియమిం చాలని జనసేన నాయ కులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.

ఉపాధ్యాయుడుని నియమించాలి
నిరసన తెలుపుతున్న జనసేన నాయకులు


బూర్జ: కొమ్మువల స పాఠశాలకు ఉపాధ్యాయుడుని  నియమిం చాలని జనసేన నాయ కులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.  శనివారం పాఠశాల ఆ వరణలో జనసేన నాయకులు మల్లేశ్వ రరావు, కొల్లివలస ఎంపీ టీసీ సభ్యుడు విక్రమ్‌, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ పనిచేసిన  ఉపాధ్యాయుడు పదోన్నతిపై వెళ్లిపోవడంతో కొత్తగా ఎవర్నీ నియమిం చలేదని తెలిపారు.  దీంతో ఇక్కడ చదువు తున్న 20 మంది విద్యార్థులు కిలోమీటరు దూ రంలో గల నర్సిపురం పాఠశాలకు పొలాల గట్లపై నుంచి వెళ్లాల్సివస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సంతోష్‌, రమేష్‌, మోహన్‌రావు, వాసు, ఆనంద్‌ పాల్గొన్నారు.


 Updated Date - 2021-11-28T05:43:43+05:30 IST