‘పట్టు’ంచుకోని ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-11-23T06:50:16+05:30 IST

రాష్ట్ర ప్రభు త్వం పట్టురైతులు, రీలర్ల సంక్షేమపై చేతులెత్తేసింది. పట్టుపరిశ్రమకు తగిన నిధులు చెల్లించటం లేదు. దాదా పు రూ.10కోట్ల రాయితీ ప్రభుత్వం బాకీ పడిందని పట్టు రైతులు, రీలర్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు

‘పట్టు’ంచుకోని ప్రభుత్వం

పట్టు రైతులు, రీలర్లకు 

పేరుకుపోయిన రాయితీ బకాయిలు 

పట్టుదారం, గూళ్ల రాయితీని చెల్లించని ప్రభుత్వం

మొత్తంగా దాదాపు రూ.10కోట్లకు పైబడిన బకాయిలు 

ఆవేదనలో రైతులు, రీలర్లు


అనంతపురం అర్బన, నవంబరు 22: రాష్ట్ర ప్రభు త్వం పట్టురైతులు, రీలర్ల సంక్షేమపై చేతులెత్తేసింది. పట్టుపరిశ్రమకు తగిన నిధులు చెల్లించటం లేదు. దాదా పు రూ.10కోట్ల రాయితీ ప్రభుత్వం బాకీ పడిందని పట్టు  రైతులు, రీలర్లు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒక ఎకరా మల్బరీ సాగుతో కొన్నివందల మంది ఉపాధి పొం దుతారు. పట్టుగూళ్ల నుంచి దారం తీయడం, పురి తిప్ప డం, డైయింగ్‌ వేయడం, మగ్గం నేసేంతవరకు ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా పట్టుదారం తయారుచేసి రీలర్‌ కేంద్రాలద్వారా అనేమంది ఉపాధి పొందుతున్నారు. ఎలా ఎందరికో ఉపాధి అభిస్తుంది. మరోవైపు జిల్లాలో తయా రయ్యే పట్టుదారం అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు. దీని ద్వారా దేశ జీడీపీ పెరుగుదలలో జిల్లా పట్టురైతులు, పట్టు రీలర్లు ముఖ్య ప్రాతపోషిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యత కల్గిన పట్టురైతులు, పట్టు రీలర్లకు రాయితీలను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం  పట్టు పరిశ్రమను నిర్వీర్యం చేసేవిధంగా వ్యవహరిస్తోందని వారు మండిపడుతున్నారు.


రీలర్లకు రూ.3.20 కోట్ల రాయితీ బకాయి

జిల్లాలో దాదాపు 500 రీలింగ్‌ యూనిట్లున్నాయి. మల్టీ ఎండ్‌ నుంచి చెరఖాల వరకు వివిధ రీలింగ్‌ యూనిట్ల ద్వారా దారాన్ని తయారు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పట్టుదారం తయారీ చేయడానికి గత ప్రభుత్వంలో రెండు అటోమేటిక్‌ రీలింగ్‌ మెషిన(ఏఆ ర్‌ఎం)లు ఏర్పాటు చేశారు. ఒక ఏఆర్‌ఎం 8గంటపాటు పనిచేయాంటే దాదాపు 500 కేజీల పట్టుగూళ్లు అవసర ముంటుంది. తాడిపత్రి, హిందూపురంలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ రెండు ఏఆర్‌ఎంలకు నెలకు 35వేల కిలోల పట్టుగూళ్లు కావాలి. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిం చకపోవడంతో రెండు కేంద్రాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండిపోయింది. కిలో పట్టుదారం తయారీకి సుమారు 7కేజీల పట్టుగూళ్లు అవసరం. ఏఆర్‌ఎంల ద్వారా నెలకు 5వేల కిలోల పట్టుదారాన్ని తయారుచేస్తున్నారు. అంటే నెలకు 35వేల కిలోల పట్టుగూళ్లు అవసరముంది.  500 రీలింగ్‌ యూనిట్లద్వారా నెలకు 4వేల కిలోల పట్టుదారాన్ని తీస్తున్నారు. ఆమేరకు నెలకు 28వేల కిల్లో పట్టుగూళ్ల కొ నుగోలు జరగాలి. పట్టురీలర్లు తయారుచేసిన పట్టుదా రానికి ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. చరఖా ద్వారా తయా రైన దారానికి రూ.30, మల్టీఎండ్‌కు రూ.130, ఏఆర్‌ఎం లకు రూ.150ల చొప్పున రాయితీ చెల్లించాలి. వివిధ రకాల పట్టు తయారీ కేంద్రాల ద్వారా జిల్లాలో నెలకు  9వేల కిలోల పట్టుదారం తయారవుతోంది. రీలర్లకు సంవ త్సరానికి దాదాపు రూ.1.07కోట్ల రాయితీని ప్రభుత్వం చెల్లించాలి. ఈ లెక్కన గత మూడేళ్లకు రూ.3.20 కోట్ల రాయితీ పట్టురీలర్లకు ప్రభుత్వం బకాయిపడింది.


50 వేల ఎకరాల్లో మల్బరీ సాగు...

జిల్లాలో చిన్న, సన్నకారు రైతులందరూ మల్బరీసాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. మల్బరీ సాగులో  రాష్ట్రంలో అ నంతపురం జిల్లాది ప్రథమస్థానం. అధికారుల గణాంకాల మేరకు జిల్లాలో 28వేలమందికి పైగా రైతులు 50వేల ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. వీరు పండించిన పట్టుగూళ్లను హిందూపురం, ధర్మవరం, కదిరి పట్టు మా ర్కెట్లలో అమ్ముకుంటున్నారు. ఈ మూడు మార్కెట్లద్వారా సంవత్సరానికి దాదాపు 400టన్నుల వరకూ పట్టుగూళ్లను ప్రభుత్వం కొనుగోలుచేస్తోంది. కిలో పట్టుగూళ్లకు ప్రభు త్వం రూ.60చొప్పున రాయితీ చెల్లిస్తోంది. ఈ మేరకు సం వత్సరానికి రూ.2.40కోట్ల పట్టుగూళ్ల రాయితీని ప్రభుత్వం చెల్లించాలి. ఈ లెక్కన మూడు సంవత్సరాలకు రూ.7.20 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.


Updated Date - 2021-11-23T06:50:16+05:30 IST