డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 18 వినతులు

ABN , First Publish Date - 2021-06-22T05:55:09+05:30 IST

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి 18 వినతులు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి తెలి పారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 18 వినతులు

 శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్‌ 21 : డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి 18 వినతులు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి తెలి పారు. కలెక్టరేట్‌లోని స్పందన విభాగంలో సోమవారం డీఆర్వో అధ్యక్షతన ఈ  కార్యక్రమం నిర్వహించారు. తన కుమార్తెకు జగనన్న విద్యాదీవెన మంజూరు కాలేదని  కొత్తూరు మం డలం నివగాంకు చెందిన ఎస్‌.షణ్ముఖరావు, జగనన్న చే యూత మంజూరు చేయాలని వీరఘట్టం మండలం పీవీ ఆర్‌పురం నుంచి కేపీ నాయుడు, వితంతు పింఛన్‌ మంజూ రు చేయాలని కొత్తూరు మండలం కౌశల్యాపురం నుంచి కె.రాజేశ్వరి, వలంటీర్‌ పోస్టు నుంచి తన భార్యను అకార ణంగా తొలగించారంటూ ఆమదాలవలస మండలం గాజు ల కొల్లివలసకు చెందిన బి.రవికుమార్‌లు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మరికొన్ని ఫిర్యాదులు అందాయి.

 ఎస్పీ స్పందనకు 14 ..

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 14 వినతులు అందాయి. ఇందులో మోసానికి సంబంధించి ఒకటి, ఆస్తి వివాదాలపై  2, వేధింపులపై 3, ఇతర కారణాలపై 4, పాత ఫిర్యాదులు 4 ఉన్నాయి.  అనంతరం పోలీసులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు.  ఇప్పటివరకు అందిన వినతులు... దానిపై తీసుకున్న చర్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేకూరుతుందన్న నమ్మకాన్ని పోలీసులు కల్పించాలని ఆదేశించారు. 

ఐటీడీఏ స్పందనకు 20..

సీతంపేట: సీతంపేటలోని ఐటీడీఏ  కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో 20 వినతులు పీవో సీహెచ్‌ శ్రీధర్‌ స్వీకరించారు. వసతిగృహాల్లో సీట్లు ఇప్పించా లని, బొమ్మికి, వెన్నెల వలస పాఠశాలల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని వినతులు అందాయి.  కార్యక్రమంలో ట్రైబుల్‌ వెల్పేర్‌ ఈఈ  మురళి, డీడీ శ్రీనివాసరావు, ఏపీడీ  డైజీ  పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:55:09+05:30 IST