ఎర్రన్నాయుడికి నివాళి

ABN , First Publish Date - 2021-11-02T05:30:00+05:30 IST

రాష్ట్ర సమస్యలను ఢిల్లీలో వినిపించి రాష్ట్రాభివృద్ధి కోసం ఎర్రన్నాయుడు చేసిన కృషి మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కొనియాడారు.

ఎర్రన్నాయుడికి నివాళి
ఎర్రన్న చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి


గిద్దలూరు, నవంబరు 2 : రాష్ట్ర సమస్యలను ఢిల్లీలో వినిపించి రాష్ట్రాభివృద్ధి కోసం ఎర్రన్నాయుడు చేసిన కృషి మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి కొనియాడారు. కేంద్ర మా జీ మంత్రి, టీడీపీ నాయకుడు  కె.ఎర్రన్నాయుడు వర్ధంతి సంద ర్భంగా ఆయన చిత్రపటానికి అశోక్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు సయ్యద్‌ షాన్షావలి, మండలశాఖ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, కొమరోలు మండలశాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్‌ మండ్ల శ్రీనివాసులు, టీడీపీ నాయకులు రజనీబాబు, బాలనాసరయ్య, తిరుమలరెడ్డి పాల్గొన్నారు. 

కంభంలో..

కంభం :  టీడీపీ పట్టణాధ్యక్షుడు ఓబులరెడ్డి మాధవమూర్తి ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుకు ఘనంగా నివా ళులర్పించారు. ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం  టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవపట్ల అంకితభావం, బాధ్యత నిర్వహణలో నిబద్ధత, పార్టీ సిద్ధాం తాలపట్ల విధేయత ఉన్న నేతగా ఎర్రన్న నిలిచారని గుర్తు చే శారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాదా, భూపాల్‌, ఖాద్రి, గౌస్‌, నాగూర్‌, సుభాని పాల్గొన్నారు.


Updated Date - 2021-11-02T05:30:00+05:30 IST