వైసీపీలో ఆధిపత్య పోరు

ABN , First Publish Date - 2021-03-22T05:41:10+05:30 IST

అధికార వైసీపీ నాయకు ల ఆధిపత్య పోరు నడుమ వల్లూరమ్మ దేవస్థానం చి క్కుకుంది.

వైసీపీలో ఆధిపత్య పోరు
వల్లూరమ్మ దేవస్థానం

కేంద్రంగా మారిన వల్లూరమ్మ దేవస్థానం

పాలకవర్గం ఏర్పాటులో విభేదాలు

మూన్నాళ్ల ముచ్చటగా ప్రమాణ స్వీకారం

కోర్టుకెక్కిన ప్రత్యర్థి వర్గం

జీవో రద్దుతో మళ్లీ మొదటికి..

తాజా నియామకం ఎప్పుడో..!

టంగుటూరు, మార్చి 21: అధికార వైసీపీ నాయకు ల ఆధిపత్య పోరు నడుమ వల్లూరమ్మ దేవస్థానం చి క్కుకుంది. దీనిప్రభావం పాలకవర్గ నియామకంపై ప డింది. వీరి వివాదాలు హైకోర్టు మెట్లెక్కడంతో పాలక వర్గం సైతం రద్దయింది. ఈక్రమంలో ఎవరి నాయక త్వంలో పాలకవర్గం ఏర్పాటయినా.. ఇదే పరిస్థితి పున రావృతం అవుతుందేమోనని భక్తులు సందేహం వ్య క్తం చేస్తున్నారు

వల్లూరమ్మ దేవస్థానం పాలకవర్గ ఎంపికపై అధి కార పార్టీలోని రెండు గ్రూపులు పోటీపడ్డాయి. కారు మంచి వైసీపీ నేత సిరిపురపు విజయభాస్కర రెడ్డి, వల్లూరు వైసీపీ నాయకుడు కుందం హనుమారెడ్డి పాలకవర్గం ఆధిపత్యం కోసం పోటీపడ్డారు. కారుమం చికే చెందిన సూరం రమణారెడ్డి చైర్మన్‌గా కమిటీ ఏ ర్పాటుకు భాస్కరరెడ్డి ముందుకురాగా, తమ గ్రామస్థు లే చైర్మన్‌గా కమిటీ ఏర్పాటుచేయాలని హనుమారెడ్డి పట్టుబట్టారు. ఈవ్యవహారానికి ముందుగా పార్టీ అధి ష్ఠానం రమణారెడ్డికి అనుకూలంగా ఉందన్న భావన తో ఆయన న్యాయకత్వంలోనే 9మంది డైరెక్టర్ల పేర్లతో జాబితా రూపొందించడం, అధిష్ఠానం అనుగ్రహం సా ధించడం కూడా జరిగిపోయింది. వీరందరినీ సభ్యులు గా ఎంపిక చేస్తూ దేవదాయ శాఖ ప్రకటన చేసింది. ఇక మిగిలింది వీరి నుంచి చైర్మన్‌ ఎంపిక చేయాలి. ఇక్కడ నుండే రెండు గ్రూపుల ఆధిపత్య పోరు ప్రారం భమయింది

చైర్మన్‌ ఎంపికలో తికమక..

దేవస్థానం పాలకవర్గ చైర్మన్‌ ఎంపికలో తికమ క చోటు చేసుకుంది. చైర్మన్‌ ఎంపికకు ముందు సభ్యు లంతా ప్రమాణ స్వీకారం చేయాలి. రమణారెడ్డి మద్దతుదారులిద్దరు దీనికి దూరంగా ఉండగా, మిగి లిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరి మద్దతుతో హనుమారెడ్డి మద్దుతుదారుడైన వల్లూరు కు చెందిన కాలే శ్రీనివాసరావు చైర్మన్‌గా ఎంపికయి నట్లు దేవస్థానం అప్పట్లో ప్రకటించింది.

హైకోర్టు కెక్కిన రమణారెడ్డి వర్గం

చైర్మన్‌ ఎంపికను జీర్ణియించుకోలేని రమణారెడ్డి వర్గం ఈవ్యవహారంపై హైకోర్టుకెళ్లింది. పాలకవర్గ ఎంపికకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌లో పొరపాట్లున్నా యని ఎత్తిచూపుతూ హైకోర్టులో కారుమంచికి చెంది న మన్నం శ్రీనివాసులు పిటిషన్‌ వేశారు. విచారణ అనంతరం పిటిషనర్‌ వాదనను అంగీకరించిన హైకో ర్టు సింగిల్‌ జడ్జి నోటిఫికేషన్‌ జారీకి ఉద్దేశించిన జీవో ను రద్దు చేసింది. దీంతో పాలకవర్గం అంతా రద్దయిం ది. ఇందుకు అగ్రహించిన హనుమారెడ్డి వర్గం సిం గిల్‌ జడ్జి తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ ప్రారం భంలోనే ఈ పిటిషన్‌ను డివిజనల్‌ బెంచ్‌ కొట్టివేసింది. దీంతో కోర్టు సింగిల్‌ జడ్జి తీర్పుకే కట్టుబడినట్లు వెల్లడయింది. దేవస్థానం పాలకవర్గ ఎంపిక నిలిచి పోవడం ఖాయమైంది.

వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుతో ఏర్పడ్డ సమ స్య ఎప్పటికి కొలిక్కి వస్తుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిప్రభావం దేవస్థానం అభివృద్ధిపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-03-22T05:41:10+05:30 IST