మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-06-22T06:58:29+05:30 IST

మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండ లంలోని దరిమడుగులో సోమవారం తెల్లవా రుజామున జరిగింది.

మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నం

ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్న గంగయ్య

ఆర్థిక కారణాలుగా ప్రాథమిక 

విచారణలో వెల్లడి

మార్కాపురం, జూన్‌ 21: మాజీ సర్పంచ్‌పై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండ లంలోని దరిమడుగులో  సోమవారం తెల్లవా రుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జానపాటి చిన్నగంగయ్యకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం ఆయన మనవరాలి (కుమార్తె కూ తురు) పెళ్లికి మార్కాపురం మండలం చెన్న రాయునిపల్లెకు కుటుంబసభ్యులందరూ వెళ్లా రు. దీంతో ఆయన ఒక్కడే ఇంట్లో పంచలో నిద్రపోతున్నాడు. సోమవారం తెల్లవారు జామున దరిమడుగుకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు, గుమ్మా పున్నారావు, శివకృష్ణ చి న్న గంగయ్యను చాకుతో పీక, చాతిపై పొ డి చారు. మృతి చెందాడని భావించి ఆక్కడ నుం చి వెళ్లిపోయారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న చిన్నగంగయ్యను పాలుపోయడానికి వెళు తున్న మహిళ చూసి ఇరుగురు పొరుగువారికి సమాచారం అందజేశారు. దీంతో గంగయ్యను 108 వాహనంలో మార్కాపురం జిల్లా వైద్య శాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనం తరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తర లించారు. సీఐ బీటీ నాయక్‌ చిన్న గంగయ్య వద్ద వాగ్మూలం నమోదు చేశారు. మాజీ స ర్పంచ్‌ కొత్తా శ్రీనివాసరెడ్డి ప్రోద్భలంతోనే తన ను హతమార్చేందుకు యత్నించారని చిన్న గంగయ్య తెలిపారు.

ఆర్థిక లావాదేవీలే కారణమా?

మాజీ సర్పంచ్‌ జానపాటి చిన్న గంగయ్య కుమారుడు గంగరాజుకు మాజీ సర్పంచ్‌ కొ త్తా శ్రీనివాసరెడ్డికి మధ్య ఉన్న ఆర్థిక లావా దేవీలే ఈ హత్యాయత్నానికి ప్రధాన కార ణంగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్ల డైనట్లు తెలిసింది. మాజీ సర్పంచ్‌ కొత్తా శ్రీని వాసరెడ్డి వద్ద జానపాటి గంగరాజు రూ.5 లక్ష లు అప్పు తీసుకున్నాడు. అది వడ్డీతో కలిసి రూ.8.50 లక్షలు అయింది. దీనిపై గుమ్మా పు న్నారావు సాక్షిగా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీనిపై కొత్తా శ్రీనివా సరెడ్డి కోర్టు ద్వారా గంగరాజుకు నోటీసులు జారీ చేయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-06-22T06:58:29+05:30 IST