ప్రపంచబ్యాంక్‌ విధానాలతోనే ఎయిడెడ్‌ పాఠశాలల మూత

ABN , First Publish Date - 2021-10-29T04:32:40+05:30 IST

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ విధానాలను అమలు చేస్తోందని అందులో భాగంగానే ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమైందని ఎమ్మె ల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు.

ప్రపంచబ్యాంక్‌ విధానాలతోనే ఎయిడెడ్‌ పాఠశాలల మూత
గౌతవరం పాఠశాలను పరిశీలీస్తున్న ఎమ్మెల్సీ

గిద్దలూరు, అక్టోబరు 28 : ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌ విధానాలను అమలు చేస్తోందని అందులో భాగంగానే ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమైందని ఎమ్మె ల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. గురువారం గిద్దలూరు మండల పరిధిలో పొదలకొండపల్లె, ముండ్లపాడు, గిద్దలూరు పాఠశాలలను పరిశీలించి అనంతరం సూర్య పాఠశాలలో జనవిజ్ఞాన వేదికలో పాల్గొన్నారు. అనంతరం రాచర్ల, గిద్దలూరు, కొమరోలు  యూటీఎఫ్‌ శాఖల ఆధ్వర్యంలో విఠా సుబ్బరత్నం కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులు అనే క సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని విఠపు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రమణరెడ్డి, గిద్దలూరు కార్యదర్శి రంగారెడ్డి, జేవీవీ రాష్ట్ర నాయకులు స్వరూపారెడ్డి, యూటీఎఫ్‌ నాయకులు సత్యనారాయణ, శాయన్న, రంగారెడ్డి,  కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పిచ్చయ్య, తిరుపతి, రామ్‌నాయక్‌ పాల్గొన్నారు. 


విద్యార్థుల సంఖ్యను పెంచాలి

రాచర్ల, అక్టోబరు 28 : ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెం చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం చెప్పారు. మండలంలో ని రాచర్ల, అనుమలవీడు, గౌతవరం, గురుకుల పాఠశాలను ఎమ్మెల్సీ విఠపు గురువారం పరిశీలించారు. ఆయనకు ఆర్డీవో లక్ష్మీశివజ్యోతి, తహసీల్దార్‌ షేక్‌ ఇబ్రహీంఖలీల్‌ ఘనస్వాగతం పలికా రు. అనంతరం పాఠశాలలను తనిఖీ చేసిన ఆ యన విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విఠపు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు.  3, 4, 5 తరగతులను హైస్కూలులో చేర్చడం వలన నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విఠపు అభిప్రాయం వ్యక్తం చేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ రమణరెడ్డి, మండల అధ్యక్షుడు శాయన్న, ప్రధాన కార్యదర్శి జయచంద్రరెడ్డి, రవీంద్రరెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:32:40+05:30 IST