రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2021-07-12T05:49:40+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయిందని తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావు ల పద్మజ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
మాట్లాడుతున్న తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావుల పద్మజ

పట్టించుకోని ప్రభుత్వం

తెలుగు మహిళ నేతల ధ్వజం 

ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 11: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువయిందని తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావు ల పద్మజ ధ్వజమెత్తారు. ఆదివారం ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకు మహి ళలపై దురాగతాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. గిద్దలూరు మండటం అంబవరం గ్రామంలోని మైనారిటీ బాలిక  అత్యా చార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా బాలిక కుటుంబాన్ని పరామర్శించకపోవడం అన్యా యమన్నారు. వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి మా ట్లాడుతూ దురాగతాలకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవ డంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. ఒంగోలు పార్ల మెంట్‌ మహిళా కార్యదర్శి బీరం అరుణా రెడ్డి మాట్లాడుతూ దశ లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చినా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు ఆగడం లేదన్నారు. ఆడపిల్లలకు మేనమామ అంటూ ముఖ్యమంత్రి మా ట్లాడటం తప్ప, రక్షణ చర్యలు లేవని అన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు చుండి శ్యామ్‌, బొడ్డపాటి వెంకట్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-12T05:49:40+05:30 IST