మహిళ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-12-30T05:38:12+05:30 IST

ఆర్థిక లావా దేవీల నేపథ్యంలో ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన ఒంగోలు నగరంలోని మహేంద్ర నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున జరి గింది.

మహిళ అనుమానాస్పద మృతి
మృతి చెందిన శాంతి

హత్యేనంటున్న బంధువులు

కేసు నమోదు 


ఒంగోలు(క్రైం), డిసెంబరు 29: ఆర్థిక లావా దేవీల నేపథ్యంలో ఓ యువతి మృతి చెందింది. ఈ సంఘటన ఒంగోలు నగరంలోని మహేంద్ర నగర్‌లో మంగళవారం తెల్లవారుజామున జరి గింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక జక్రయ్యనగర్‌కు చెందిన కోడూరి శాంతి(32) పదమూడేళ్ల ఏళ్ల క్రితం ఇస్లాంపేటకు చెందిన షేక్‌ అహమద్‌ను వివాహం చేసుకుంది. వారికి 11 ఏళ్ల బాలుడు ఉ న్నాడు. అయితే భార్యాభర్తలు ఎవరిదారిన వారు జీవిస్తున్నారు. ఈక్రమంలో గోపాల్‌నగర్‌లో నివాసం ఉంటున్న జిలానీతో శాంతికి పరిచయం ఏర్పడింది. అతడికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. అయితే ఇటీవల జిలానీ ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నాడు. దీంతో ఈ నెల 27న రాత్రి జి లానీ ఇంటి వద్దకు శాంతి వెళ్లి గొడవ చేసింది. తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని, లే కుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఆ సమయంలో జిలానీ ఇంట్లో లేడు. రాత్రి పొద్దు పోయిన తరువాత ఇంటికి వచ్చిన జిలానీని అత ని అన్న రఫీ ఈ విషయంపై నిలదీశాడు. అంతే గాకుండా అతనిపై చేయి చేసుకున్నట్లు తెలిసిం ది. ఈమేరకు అర్ధరాత్రి దాటిన తరువాత శాంతి ఇంటికి జిలానీ వెళ్లి గొడవపడ్డాడు. అదే సమ యంలో ఆమెపై దాడి చేయడంతో మృతి చెందిం ది.  ఈ విషయం తెలసుకున్న శాంతి బంధువు లు 28వ తేదీ రాత్రి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యా దు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రా ఘవ తెలిపారు.


Updated Date - 2021-12-30T05:38:12+05:30 IST