బిల్లులు చెల్లించకుండా.. మళ్లీ పనులు ఎలా సాధ్యం?

ABN , First Publish Date - 2021-12-08T05:39:48+05:30 IST

పూర్తి చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోతే మళ్లీ ప నులు ఎలా సాధ్యమని పంచాయతీరాజ్‌ స్పెషల్‌ కమిషనర్‌ శాంతి ప్రియపాండే ముందు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పథకం ద్వారా చేపట్టిన వివిధ పనులను మంగళవారం కమిషనర్‌ పరిశీలించారు.

బిల్లులు చెల్లించకుండా.. మళ్లీ పనులు ఎలా సాధ్యం?
కమిషనర్‌ శాంతిప్రియ పాండే వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న కాంట్రాక్టర్లు

కాంట్రాక్టర్లు, నేతల ఆవేదన 

మండలంలో పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌ పర్యటన 

ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పనుల పరిశీలన


పర్చూరు, డిసెంబరు 7 : పూర్తి చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోతే మళ్లీ ప నులు ఎలా సాధ్యమని పంచాయతీరాజ్‌ స్పెషల్‌ కమిషనర్‌ శాంతి ప్రియపాండే ముందు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పథకం ద్వారా చేపట్టిన వివిధ పనులను మంగళవారం కమిషనర్‌ పరిశీలించారు. చిన్ననందిపాడు గ్రామానికి చేరుకున్న కమిషనర్‌కు జడ్పీటీసీ సభ్యురాలు కొ ల్లా గంగాభవానీ దుశ్శాలువాతో స్వాగతం పలికా రు. అనంతరం అడుసుమల్లి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులతో అభివృద్ధి చేసిన శ్మశానవాటికను, జడ్పీహైస్కూల్‌ ప్రాంగణంలో మెరకతోలిన ప్రాంగణాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి రావి నామనాథంతోపాటు కలసి పరిశీలించారు. అడుసుమ ల్లి ఎస్సీ కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన లింక్‌రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువు రు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు లక్షలు పెట్టుబడులు పెట్టి పూర్తిచేసిన అభివృద్ధి పనుల బిల్లులకు ఎఫ్‌టీవోలు కూడా కావటం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారి ము ందు మొరపెట్టుకున్నారు. త్వరలో బిల్లులు చెల్లిం చే విధంగా కృషిచేస్తామని కమిషనర్‌ హామీ ఇ చ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీఈవో డి.జాలిరెడ్డి, డీపీవో గొల్లమూడి నారాయణరెడ్డి, అడిషన ల్‌ పీడీ వెంకట్రామిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్సీ మ ర్ధన్‌ఆలీ, డీఈఈ సతీ్‌షచంద్ర, ఏపీ డీవో రావి భ వానీ, ఫ్లాంటేషన్‌ మేనేజర్‌ విజయలక్ష్మి, ఈవో కొ సనా సత్యనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కొల్లా సుభా్‌షబాబు, కుక్కపల్లి నాగేశ్వరరావు, య ద్దనపూడి హరిప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T05:39:48+05:30 IST