భార్య హత్య కేసులో భర్త అరెస్టు

ABN , First Publish Date - 2021-01-21T04:14:35+05:30 IST

భార్య అనుమానాస్పద మృతి కేసులో భర్తను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు చెప్పారు.

భార్య హత్య కేసులో భర్త అరెస్టు


కందుకూరు, జనవరి 20 : భార్య అనుమానాస్పద మృతి కేసులో భర్తను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు చెప్పారు. వివరాలల్లోకి వెళితే.. మండలంలోని పలుకూరు గ్రామానికి చెందిన ఝాన్సీనాగమణి కనుమళ్ల సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఈ నెల 11న ఇంటిలోని బాత్‌రూంలో అపస్మారక స్థితిలో పడిఉందని భర్త మాల్యాద్రి ఆమెను బంధువుల సాయంతో ప్రైవేటు హాస్పిట్‌లకు తరలించాడు. ఝాన్సీనాగమణి చికిత్స పొందుతూ మృతి చెందింది. తల్లిదండ్రులు లేని ఝాన్సీ మృతిపై ఆమె పిన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం రిపోర్టులో కూడా మెడకు చుట్టి లాగడంతో చనిపోయిందని వచ్చింది. దీంతో పోలీసులు మృతురాలి భర్తను అరెస్టు చేశారు.

Updated Date - 2021-01-21T04:14:35+05:30 IST