సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2021-09-04T04:46:06+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక డ్వాక్రా బజారులో శుక్రవారం మార్కాపురం, తర్లుపాడు మండలాలలోని డప్పు కళాకారులకు సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ నాయకులు గత ఐదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇప్పుడు ధర్నాలు, నిరసనల పేరుతో నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారన్నారు. అనంతరం మార్కాపురం మండలంలో 62 మందికి, తర్లుపాడు మండలంలో 21 మందికి సామగ్రిని అందజేశారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలి
పరికరాలను అందజేస్తున్న ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

మార్కాపురం, సెప్టెంబరు 3: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక డ్వాక్రా బజారులో శుక్రవారం మార్కాపురం, తర్లుపాడు మండలాలలోని డప్పు కళాకారులకు సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ టీడీపీ నాయకులు గత ఐదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇప్పుడు ధర్నాలు, నిరసనల పేరుతో నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారన్నారు.  అనంతరం మార్కాపురం మండలంలో 62 మందికి, తర్లుపాడు మండలంలో 21 మందికి సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిల్లంచెర్ల బాలమురళీకృష్ణ, ఎంపీడీవో నరసింహులు, ఈవోపీఆర్డీ రామ్మోహన్‌రెడ్డి, ఏఎ్‌సడబ్లూవో అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

అధికారిక కార్యక్రమంలో వేదికపై వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్వాక్రా బజారులో శుక్రవారం జరిగిన అధికారిక కార్యక్రమ వేదికపై వైసీపీ నేత ప్రతక్షమయ్యాడు. మార్కాపురం పురపాలక సంఘ వైస్‌చైర్మన్‌ - 2 అయిన చాతురాజుపల్లి అంజమ్మ స్థానంలో ఆమె భర్త శ్రీనివాసులు వేదికపై కూర్చోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 


Updated Date - 2021-09-04T04:46:06+05:30 IST