అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం
ABN , First Publish Date - 2021-11-21T05:51:41+05:30 IST
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర మండల కేంద్రమైన గుడ్లూరులో శనివారం ఉదయం ప్రారంభమైంది.

పలువురు సంఘీభావం
గుడ్లూరు, నవంబరు 20: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర మండల కేంద్రమైన గుడ్లూరులో శనివారం ఉదయం ప్రారంభమైంది. మెగుళ్లూరు, పెద్దలాటవరపి, చినలాటరపి, గ్రామాలను కలుపుకుంటూ నరసాపురం వరకు సాగింది. జోరువాన ఉన్నప్పటికీ, యాత్రను ఆపలేదు. జననీరాజనీరాజనాల మధ్య కోలాహలంగా ఐదు గ్రామాలను కలుపుకుంటూ యాత్ర సాగింది. ఈ యాత్ర కందుకూరు మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు, డాక్డర్ శివరాంతో పాటు, కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహరెడ్డి, టీడీపీ ఇంటూరి రాజే్‌షతో పాటు, సీఎ్‌సపురం మండల టీడీపీ నాయకులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు.
గుడ్లూరు మొదలు చినలాటవరపి వరకూ 7 కిలో మీటర్లవరకు వర్షం కురుస్తూనే ఉంది. ఈ సందర్భంగా పాదయాత్రకు కనిగిరి నియోజకవర్గం తరఫున మాజీ శాసనసభ్యులు ఉగ్రనరసింహరెడ్డి రూ.15 లక్షలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కందుకూరు మాజీ శాసన సభ్యులు పోతుల రామారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల రాజధానిగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. అమరావతి మహిళల పాదయాత్రలో చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం, ఇంటూరి రాజేష్, పోతుల ప్రసాదు, జనిగర్ల నాగరాజు, చిత్తారి మల్లికార్జున, చెన్నారెడ్డి మహేష్, చల్లా వీరరాఘవులు, మద్దసాని కృష్ణ, మేకల మాల్యాద్రి, గోచిపాతల మోషే, పువ్వాడి వేణుగోపాల్ పలువురు మహిళలు రైతులు పాల్గొన్నారు. నరసాపురం వద్ద జిల్లాలో పాదయాత్ర ముగిసి నెల్లూరు జిల్లాకు చేరింది.