నిండుకుండలా ఉన్నా.. నిరుపయోగమే!

ABN , First Publish Date - 2021-03-22T05:27:50+05:30 IST

నిండు కుండలా ఉన్నా నిరుపయోగమే.. ముడుపులు, కమీషన్లకు ముటుకుల ప్రాజెక్టు బలవుతోంది.

నిండుకుండలా ఉన్నా.. నిరుపయోగమే!
ముటుకుల సమ్మర్‌ స్టోరేజీ తాగు నీటి పథకం

ముటుకుల ప్రాజెక్టు ద్వారా చుక్కనీరు అందని వైనం

కమీషన్ల కోసం ట్యాంకర్లతో వ్యాపారం

రూ.35 కోట్లు ఖర్చు చేసినా వృథా

పుల్లలచెరువు, మార్చి 21:  నిండు కుండలా ఉన్నా నిరుపయోగమే.. ముడుపులు, కమీషన్లకు ముటుకుల ప్రాజెక్టు బలవుతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు నిర్వహణ చేతగాక ప్రజలకు చుక్క నీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేసి ఫ్లోరైడ్‌ పీడత గ్రామాలకు నీటిని సరాఫరా చేసేందుకు 2009లో రూ.10 కోట్లతో ముటుకుల ప్రాజెక్టును నిర్మించింది. అప్పటి నుంచి నిర్వహణ పేరుతో దాదాపు రూ.35 కోట్ల వరకూ ఖర్చు చేసినా ఒక్క గ్రామానికి కూడా చుక్క నీరు అందే పరిస్థితి లేదు.  తప్పుడు లెక్కలతో గ్రామాలకు నీరు ఇస్తున్నట్లు చూపించి ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి మింగేస్తున్నారు. గ్రామాల్లోని కొన్ని తాగునీటి పథకాలకు నీరు వస్తున్నప్పటికీ అధికారులు, గ్రామ స్థాయి నాయకులు కుమ్మకై మరమ్మతులు చేయకుండా ట్యాంకర్లకు సిఫార్స్‌ చేస్తూ కోట్లాది రూపాయల నిధులు బొక్కేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.  

వ్యాపారంగా మారిన ట్యాంకర్ల సరాఫరా 

పుల్లలచెరువు మండలంలో  తాగునీటి పథకాలు మూలనపడ్డాయి. వా టి నిర్వహణ, మరమ్మతులను పట్టించుకోని అధికారులు కమీషన్ల కక్కుర్తి కి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ట్యాంకర్ల నీటి సరఫరా ఈ ప్రాంతంలో వ్యాపారంగా మారిపోయింది. మండలంలోని అధికారుల లెక్కల ప్రకారం  15 పంచాయతీలకు ప్రస్తు తం వంద ట్యాంకర్ల ద్వారా సరాఫరా చేస్తున్నారు. జియో ట్యాగ్‌ను ఆస రాగా తీసుకొని కొందరు ట్యాంకర్లను భోగస్‌ ఫొటోలు తీసి నీటిని సరఫరా చేయకుండానే ట్రాక్టర్లను అటు ఇటు తిప్పి లబ్ధి పొందుతున్నారు.  

ముటుకుల తాగునీటి పథకం పనిచేస్తున్నప్పుడు ట్యాంకర్ల ద్వారా తాగు నీరు ఎందుకు సరాఫరా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కనీ సం ముటుకుల గ్రామంలో ప్రాజెక్టు  ఉన్నా ఇప్పటికీ ఆ గ్రామంలో నీరురాని పరిస్థితి. ముటుకుల తాగునీటి పథకం ద్వా రా  44 గ్రామాల కు నీళ్లు ఇవ్వాల్సి వుండగా,  అధికారులు మాత్రం ఒక్కరోజు కుడా నీటి సరఫరా చేసింది లేదు. 

ప్రాజెక్టులో లోపం ఎక్కడ?

ముటుకుల తాగు నీటి పథకానికి ప్రతి ఏడాది సాగర్‌ నుంచి నీళ్లు నింి ప లీకుల పేరుతో  వృథాగా నేలపాలు చేస్తున్నారు. ప్రాజెక్టులో ఇప్పడు 80 శాతం నీరు ఉంది. ప్రఽధానంగా ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ట్యాంకులో  ఎటువంటి లోపం లేనప్పటికీ నీటి సరాఫరా చేసే పైపులు అప్పటి కాంట్రాక్టరు అధికారులు కుమ్మకై నాసిరకం మెటీరియల్‌ వాడడంతో లీకేజీలతో నీటి సరఫరా చేయగానే పగిలిపోతున్నాయి. ప్రాజెక్టు నుంచి నీటి సరాఫరా చేసే పైపులైను డిజైన్‌ సరిగా లేకపోవడంతో ఒక్క రోజు కూడా ప్రాజెక్టు పనిచేయలేదు. అయితే ఒక్క రోజు నీరు రాకపోయినా నిర్వహణ పేరుతో  ఇప్పటి వరకు రూ.25 కోట్లు మెక్కేశారు.  ఈ పథకం పూర్తి స్థాయిలో పనిచేస్తే మండలంలోని 36 గ్రామాలకు నీటి కొరత తీరనుంది. కోట్లాది రూపాయల నిధులు మిగులుతాయని పలువురు పేర్కొన్నారు.

Updated Date - 2021-03-22T05:27:50+05:30 IST